యుద్ధంలో జోక్యం చేసుకోబోం.. కుండబద్దలు కొట్టేసిన బ్రిటన్ ప్రధాని

posted on: Apr 2, 2026 6:15AM

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్   సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంతో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ యుద్ధంలో తమ దేశం జోక్యం చేసుకోబోదని కుండబద్దలు కొట్టేశారు. ఇది మా యుద్ధం కాదు, ఇందులోకి మమ్మల్ని లాగొదని విస్పష్టంగా చెప్పేశారు.  అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి  తలొగ్గే ప్రసక్తి లేదన్నారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన కీర్ స్టార్మర్.. గత కొద్ది రోజులుగా ఇరాన్ యుద్ధంలో బ్రిటన్ పూర్తిస్థాయిలో పాల్గొనాలని ట్రంప్ బహిరంగంగా  డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో  ఈ విస్పష్ట ప్రకటన చేయడం విశేషం.   మిత్రదేశాలు సహకరించకపోతే, అమెరికాను 'నాటో'  కూటమి నుంచి తప్పిస్తానని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని   స్టార్మర్  తమ ప్రభుత్వం బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది తప్ప, అమెరికా వంటి  బాహ్య శక్తుల ఒత్తిడికి లోనై అనవసర పోరాటాల్లో దిగదని క్లియర్ కట్ గా చెప్పేశారు. 

యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ముఖ్యంగా 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండా నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా అంతర్జాతీయ దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు.  

ఇదే బ్రిటన్ నౌకాదళం కేవలం 'బొమ్మల' వంటిదని, వారి యుద్ధ విమాన వాహక నౌకలు పనికిరానివని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై  స్పందిచిన కీర్ స్టార్మర్ నాటో  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ కూటమి అని గుర్తు చేస్తూ.. దానికి బ్రిటన్   కట్టుబడి ఉంటుందన్నారు.   నాటో కూటమి భవిష్యత్తుపై ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా, బ్రిటన్ మాత్రం తన సైనిక బలగాలను ఈ వివాదంలోకి పంపే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పడం అంతర్జాతీయంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...