తక్కువ మాట్లాడే వ్యక్తులే శక్తివంతులుగా, గొప్పవాళ్లుగా  మారతారు.. ఎందుకంటే..!

posted on: Apr 9, 2026 4:50PM

ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం.  తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే..

తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది..

ఎప్పుడూ  మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై  చుట్టూ ఉన్నవారు  శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల  వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.

ఆలోచనా శక్తి..

తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు.  ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే  వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి.   సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది.

ఆత్మవిశ్వాసం..

 తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి  పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా  నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు.  తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది.

అర్థం చేసుకునే అవకాశం..

తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఇతరుల మాటలను వినడానికి  అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే  ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై  ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి,  విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది.

                                *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...