ఆర్ఆర్ ను సంజు శాంసన్ ఎందుకు వీడాడంటే?

posted on: Mar 17, 2026 3:20PM

టీమిండియా స్టార్  బ్యాటర్  కమ్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి విదితమే. అయితే న్నాళ్లూ జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ ఎందుకు తప్పుకున్నారనే దానిపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి.  ఈ నేపథ్యంలో శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఇటీవల స్పందిస్తూ, ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలను మరియు జట్టులో చోటుచేసుకున్న పరిణామాలను వెల్లడించారు.

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంజు శాంసన్‌ను ఎంతో గౌరవంగా చూసుకుందనీ,  ఆ ఫ్రాంచైజీలో తన కుమారుడు   తలపై కిరీటం ఒక్కటే తక్కువగా రాజాలా ఉండేవాడనీ, జట్టు యాజమాన్యం  సంజూ శాంసంగ్ కు ఆ స్థాయి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. అయితే గత కొంత కాలంలో జట్టులో మారుతున్న సమీకరణాల కారణంగాన సంజు బయటకు వచ్చాడని వివరించారు.  జట్టులోని యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌ల కెప్టెన్సీ ఆకాంక్షల కారణంగానే సంజు జట్టును వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.  

 భవిష్యత్తులో జట్టులో ఎలాంటి విభేదాలు లేదా ఆధిపత్య పోరు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే సంజు శాంసన్  రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాడని విశ్వనాథ్ వివరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు కూడా రాజస్థాన్ రాయల్స్ లో తన ప్రయాణం ముగిసిందని భావించడం వల్లే.. బయటకు వచ్చాననీ, గౌరవ ప్రదంగా బయటకు రావాలన్న ఉద్దేశంతోనే ఆ మార్గం ఎంచుకున్నాననీ చెప్పిన సంగతి తెలిసిందే.  

రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చే క్రమంలో సంజుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి దిగ్గజ జట్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ వైపే మొగ్గు చూపడానికి కారణం.. ధోనీ నిష్క్రమణ తరువాత కీపింగ్ సహా కీలక బాధ్యతలు లభించే అవకాశాలుండటమే కారణమని క్రికెట్ పండితులు అంటున్నారు.  

ప్రస్తుతం సంజు శాంసన్   అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, టి20 వరల్డ్ కప్ టైటిల్ విన్ లో కీలక పాత్రపోషించడం, వరల్డ్ కప్ టోర్నీలో చివరి మూడుమ్యాచ్ ల విజయంలో సంజు కీలకం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అంతా భావిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...