ముర్ము కి వ్య‌తిరేకం కాదు.. కేటీఆర్‌

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా కు టీఆర్ఎస్  మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా  యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్  వేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్   విలేక‌రుల‌తో మాట్లాడుతూ,  త‌మ‌కు తోచిన విధంగా పాల‌న సాగించేవారికి, ఇత‌రుల సంగ‌తి ప‌ట్ట‌ని వారికి ఎప్పుడూ వ్య‌తిరేక‌తే ఎదుర వుతుందన్నారు. తాము అద్భుతంగా ప‌రిపాలిస్తున్నామ‌ని భ‌జ‌న చేసుకోవ‌డంలోనే బిజెపీ కాలం గ‌డుపుతోందే గాని తెలంగాణా ప్రభుత్వం అభ్య‌ర్ధ‌న‌లు బొత్త‌గా ప‌ట్టించుకోవ‌డంలేదన్న‌ది తెలంగాణ ప్రజల అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా బిజెపీ కూట‌మి ద్రౌప‌ది ముర్మును నిల‌బెట్టింది. ఆమె ఒరిస్సా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తు ల‌కు చెందిన మ‌హిళ అయినా   తెలంగాణా ప్ర‌భుత్వం ఆమెకు మ‌ద్ద‌తునీయ‌డానికి  నిరాక‌రించిం ది. అయితే అది ఆమె ప‌ట్ల వ్యతిరేకత కాద‌ని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకి నిర‌స న‌గానే ముర్ముకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలేద‌ని కేటీఆర్ అన్నారు. 

కేంద్రం గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని  చేయ‌డానికి  అంద‌రి మ‌ద్ద‌తు  కోరుతున్నారు కానీ  తెలంగాణా ప్ర‌భుత్వం తెలంగాణాలోని ఏడు గిరిజ‌న మండ‌లాల‌ను త‌మ‌కు తిరిగి ఇవ్వాల‌ని చేస్తున్న డిమాండ్‌ను మాత్రం కేంద్రం పెద్దలు ప‌ట్టించుకోవ‌డం లేదని విమర్శించారు.

అలాగే అత్యంత కీల‌క‌మైన గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు గురించి తెలంగాణా ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌న‌ను కూడా కేంద్రం పెడ‌చెవిన పెట్టిందన్నారు.

 ఈ ప‌రిస్థితుల్లో  బిజెపి కూట‌మి నిల‌బెట్టిన అభ్య‌ర్ధికి తెలంగాణా ప్ర‌భుత్వం ఏ విధంగా మ‌ద్ద‌తునిస్తుందని ప్రశ్నించారు.  అందుకే విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ ఎస్ మ‌ద్ద‌తునిస్తున్నద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

 ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతి రేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అక్రమాలకు అడ్డూ అదుపూ లే కుండా పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  యశ్వంత్ సిన్హా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు   టీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, డాక్టర్ రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, వెంకటేష్, రవిచంద్ర, పాటిల్ తదితరులు పాల్గొన్నారు.