నీకు నేను..నాకు నువ్వు.. ఒకరికొకరం నువ్వూ నేనూ!

అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. కాలం క‌టువుగానే సాగుతూంటుంది. ఏది ఎప్పుడైనా జ‌ర‌గ‌వ‌చ్చు. నిన్న‌టి ప్రేమికులు ఏదో కార‌ణంతో విడిపోవ‌చ్చు. పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌ను విడిచీ పోవ‌చ్చు. కాలం విలువ‌ల్ని మార్చేస్తుంటుంది. ఊహ‌లోకంలో విహ‌రించ‌డం కృష్ణ‌శాస్త్రిగారి క‌విత‌ల్లోనే సాగుతుంది. వాస్త‌వం శ్రీ‌శ్రీ చెప్పి న‌ట్టుగానే వుంటుంది. కానీ ఎక్క‌డో ఎప్పుడో ఒక్క‌రు మాత్రం ఆదుకోవ‌డానికి అమాంతం అమృత‌హ‌స్తం అందించ‌వ‌చ్చు. ఒక‌వంక తుపాను గాడ్పుల‌కు వూరు వూరంతా వొణికిపోతూంటే ఈ  గువ్వ‌లు త‌మ‌ను తాము ర‌క్షించుకుంటున్నాయి. ఇదే బంధ‌మంటే. కాలు జారితే దూర‌మ‌వుతుంద‌న్న భీతి రెండింటిలోనూ వుంది. అందుకే.. ఒక‌టి వొణికి  ప‌డ‌బోతోంటే రెక్క‌తో ద‌గ్గ‌రికి లాక్కుంటోంది రెండోది.  అదీ అంతే ..నీకు నేను న్నానంటూ అదీ త‌న రెక్క‌తో ద‌గ్గ‌రికి తీసుకుంటోంది!  ఇలాంటి తోడొకటి చాలదూ జీవితానికి.