Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ తో రణం.. అమెరికాకు గెలుపు అందని యుద్ధం!
posted on: Mar 31, 2026 2:56PM

అగ్రరాజ్యం జోక్యంతో పశ్చిమాసియాలో దశాబ్దాలుగా సాగుతున్న ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ఇరాన్ ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసి నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో అమెరికా వ్యూహాత్మకంగా చేపట్టిన దాడులు.. ఆ దేశాన్ని యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనక తప్పని స్థితికి తీసుకువెళ్లాయి. సరే అది పక్కన పెడితే ఇరాన్ ను ఏకాకిని చేసి ఆ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తూ చక్రం తిప్పాలన్న అమెరికా ఆశలు అడియాశలుగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యక్షంగా యుద్ధానికి దిగిన అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యలా మారింది. ఇక ఇది అగ్రరాజ్యానికి గెలుపు అందని యుద్ధంగా పరిణమిస్తోంది.
సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం కలిగిన ఇరాన్, అమెరికా ఒత్తిడికి ఇసుమంతైనా చలించడం లేదు. తలొగ్గడం లేదు. అమెరికాకు ఇరాన్‌తో యుద్ధం తన అగ్రరాజ్యహోదాకే ముప్పు తెచ్చిపెట్టేదిగా తయారైంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాతఇరాన్ ను అమెరికా, ఇజ్రాయెల్‌లు బద్ధశత్రువుగా భావిస్తున్నారు. అప్పటి నుంచి టెహ్రాన్‌పై అగ్రరాజ్యం అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది అయితే ఆ దేశం వాటన్నిటినీ తట్టుకుని, తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది. రష్యా, చైనా వంటి దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడిని దీటుగా ఎదుర్కొంటూ వస్తోంది.
ఇప్పుడు అమెరికా ఇరాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో నాటో దేశాల మద్దతునూ క్రమంగా కోల్పోయే పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నట్లైంది. అసలు ఇరాన్ విషయంలో అమెరికా నిఘా వర్గాల అంచనాలు ఘోరంగా విపలమయ్యాయి. కేవలం నాయకత్వం మారితే ఇరాన్ వ్యవస్థ కుప్పకూలుతుందన్న అమెరికా అంచనాలు తప్పాయి. ఎనిమిదేళ్ల పాటు ఇరాక్ వంటి దేశాలతో యుద్ధం చేసిన అనుభవం, క్లిష్ట పరిస్థితుల్లోనూ చమురు ఉత్పత్తిని కొనసాగించగల సామర్థ్యం ఇరాన్ కు రక్షణ కవచాలుగా మారాయి.
ఇక ఇప్పుడు అమెరికా ఇరాన్ పై చేస్తున్న దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాక్, లిబియాల్లో అమెరికా చేసిన ప్రయోగాలు విఫలమై ఆ దేశాలు అస్థిరతకు గురైన విషయాన్ని మరువలేము. ఇరాన్ విషయంలోనూ అగ్రరాజ్యం అదే బాటలో పయనిస్తే, అది ఆదేశానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.






