Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేవీలో పోకిరీలు... అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియోలు...
posted on: Jun 3, 2017 11:11AM

విశాఖ తూర్పు నావికా దళ ప్రతిష్ట మసకబారుతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు నేవీ పేరును మంట కలుపుతున్నాయి. ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన నేవీ ఉద్యోగుల్లో కొందరు పోకిరీ వేషాలు వేస్తూ అభాసుపాలవుతున్నారు. విశాఖ శ్రీహరిపురం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఓ మహిళ స్నానం చేస్తుండగా...నేవీ ఉద్యోగి సందీప్ నర్వాల్ పోకిరీ వేశాలేశాడు. వీడియో చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికి పోయాడు. దాంతో చితకబాదిన స్థానికులు... సందీప్‌ను పోలీసులకు అప్పగించారు. నిందితుడు గతంలో కూడా మహిళల అభ్యంతర కరమైన వీడియోలు తీసి... పోర్న్ సైట్లో పోస్ట్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సందీప్ నర్వాల్ తరహాలోనే కొందరు ఉద్యోగులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. హిజ్రాలతో గొడవ, మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు చేయడం వంటి కేసులు నమోదు అయ్యాయి. సందీప్ నర్వాల్ అరెస్టుకు కొద్ది గంటల ముందే ఐఎన్ఎస్ రాణా యుద్ద నౌక లో పని చేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన వికాస్ అనే సైలర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. నౌక దగ్గరకు విధులకు వెళ్లిన కొద్దిసేపటికే గన్ పేలి ప్రణాలు కోల్పోయాడు. వికాశ్ మృతిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఎక్కువరోజులు కుటుంబాలకు దూరంగా ఉండటం వల్లే ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనై మద్యానికి బానిస కావడం, నేరాలకు పాల్పడం పారిపాటిగా మారుతున్నట్లు తెలుస్తోంది.



.jpg)


