Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెళ్లి ఫొటోలు అమ్ముకున్న విరాట్, అనుష్క శర్మ...!
posted on: Dec 12, 2017 2:36PM

టీమిండియా నెం వన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మల ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోంది. మధ్యలో వారిద్దరి బ్రేకప్ అయ్యారు.. విడిపోయారు అంటూ పుకార్లు వచ్చినా.. అవన్నీ పుకార్లే అని నిరూపించారు. ఇక విరాట్, కోహ్లీ పెళ్లి విషయంలో కూడా ఎప్పటినుండో వార్తలు వచ్చాయి. ఈ నెలలోనే వారిద్దరి వివాహం ఉంటుందని.. పలు వార్తలు వచ్చినా.. ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో అందరూ ఏం జరుగుతుందా అని ఎదురుచూశారు. అయితే కోహ్లీ, అనుష్క మాత్రం సైలెంట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు.
.jpg)
విరాట్, అనుష్కశర్మ ముందుగా ఎలాంటి ప్రకటన చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. ఏదో పెళ్లికి ముందు కోహ్లీ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ తరువాత వారికి సంబంధించిన కొన్ని ఫొటోలు.. ఏదో కొన్ని సెకన్ల వీడియోలు పోస్ట్ చేశారు. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు, పెళ్లి అన్నీ ఇటలీలోనే జరిగాయి. కానీ వాటికి సంబంధిచిన ఫుల్ వీడియోలు..ఫోటోలు మాత్రం బయట పెట్టలేదు. పెళ్లి ఏలాగూ సీక్రెట్ గా చేసుకున్నారు... కనీసం వీడియో, ఫొటోలు అయినా చూడొచ్చు అనుకున్నారు అభిమానులు. అయితే ఇక్కడే ఇంకో విషయం బయటపడింది. అదేంటంటే... వారి పెళ్లి ఫొటోలు అమ్మకానికి పెట్టారట. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఓ ఫ్యాషన్ మేగజైన్‌కు అమ్మినట్లు తెలుస్తోంది. అదేంటీ.. ఫొటోలు అమ్మకోవడం ఏంటీ అనుకుంటున్నారా...? అయితే దీని వెనుక ఓ రీజన్ ఉంది లేండి..ఈ ఫొటోలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని అనుష్క, విరాట్ నిర్ణయించుకున్నారట. అందుకే వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు తప్ప ఇతర ఫోటోలు బయటకు రానివ్వలేదట. హీరోయిన్ అనుష్క, క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఇమేజ్ ఆధారంగా ఈ ఫోటోలను భారీ ధరకు అమెరికా కేంద్రంగా నడిచే ఓ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మేగజన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలను ఎంత మొత్తానికి అమ్మారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు
ఇదిలా ఉండగా డిసెంబర్ 21న న్యూఢిల్లీలోని తాజ్ డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్‌లో వీరి రిసెప్షన్ వేడుక జరగనుంది. అలాగే ముంబైలో కూడా బాలీవుడ్ తారలకు ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.



.jpg)


