విజ‌య‌సాయికి వైఎస్ అనిల్‌రెడ్డితో చెక్‌!.. త్వ‌ర‌లోనే ఉత్తరాంధ్ర నుంచి అవుట్‌!

విజ‌యసాయిరెడ్డి. జ‌గ‌న్‌రెడ్డి ప‌క్క‌న ఆయ‌న క‌న‌బ‌డి చాలా కాలం అవుతోంది. ఇన్ని నెల‌ల్లో ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా జ‌గ‌న్‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌రం రాలేదనుకోవాలా? క‌నీసం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల అయిన సంద‌ర్భంగా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌రిగిన వేడుక‌ల‌కైనా రాకుండా ఉంటారా? ఎంత వైజాగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. తాడేప‌ల్లి ఎంత దూరం? మ‌రి, ఆయ‌న రావ‌ట్లేదంటే ఏమిటి అర్థం? వైసీపీలో నెంబ‌ర్ 2గా ఉన్న విజ‌య‌సాయి నెల‌ల త‌ర‌బ‌డి జ‌గ‌న్‌ను న‌మ‌ష్కారం పెట్ట‌కుండా ఉండ‌టం సాధ్య‌మేనా? పోలా.. తెలిసిపోలా.. వారిద్ధ‌రికి బాగా చెడింద‌ని ఇట్టే అర్థ‌మైపోలా. జ‌గ‌న్‌రెడ్డి త‌న రైట్ హ్యాండ్‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు బ‌లం చేకూర్చేలా అనేక ఎగ్జాంపుల్స్ క‌నిపిస్తున్నాయి. 

ఢిల్లీలో ఆయ‌న ప్రాధాన్యం త‌గ్గిస్తూ.. రిటైర్డ్ సీఎస్ ఆదిత్యానాథ్‌దాస్‌కు హ‌స్తిన బాధ్య‌త‌లు అప్ప‌గించి విజ‌య‌సాయి ప‌వ‌ర్స్ క‌ట్ చేశారు. తాజాగా, ఆయ‌న‌కు చెక్ పెట్టేలా మ‌రో వ్యూహ‌ర‌చ‌న కూడా చేస్తున్నార‌ని తెలుస్తోంది. విజ‌య‌సాయిపై ప్ర‌యోగించ‌పోయే ఆ ఆయుధం.. వైఎస్ అనిల్‌రెడ్డి. అవును, వైఎస్ అనిల్‌రెడ్డి. వైఎస్ కుటుంబ స‌భ్యుడే. బ్ర‌ద‌ర్‌ను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని జ‌గ‌న్‌రెడ్డి భావిస్తున్నార‌ట‌. అది కూడా విజ‌య‌సాయిరెడ్డి ప్లేస్‌లో పంపాల‌నుకోవ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. త్వ‌ర‌లోనే విజ‌య‌సాయి రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈసారి ఆయ‌న్ను రెన్యూవ‌ల్ చేయ‌కుండా.. ఆ స్థానంలో అనిల్‌రెడ్డిని పెద్ద‌ల స‌భ‌కు పంపాల‌నేది జ‌గ‌న్ స్కెచ్‌. 

ఢిల్లీలో జ‌గ‌న్‌కు తెలీకుండా విజ‌య‌సాయి సొంతంగా బీజేపీ పెద్ద‌ల‌తో మంత్రాంగం న‌డుపుతుండ‌టంతో విజ‌య‌సాయితో ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌నేది జ‌గ‌న్‌రెడ్డి భావ‌న‌. ఇక ఉత్త‌రాంధ్ర‌లోనూ త‌న‌కు తెలీకుండా నెంబ‌ర్ 2 నంటూ ఓవ‌రాక్ష‌న్ చేస్తున్న విజ‌య‌సాయి తోక క‌ట్ చేయాల‌ని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ముందు ఢిల్లీ వెళ్ల‌కుండా చెక్ పెట్టి.. ఆ త‌ర్వాత స్టేట్‌లోనూ ప్ర‌యారిటీ త‌గ్గించనున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఆదిత్యానాథ్‌ను హ‌స్తినకు పంప‌గా.. ఇక రాజ్య‌స‌భ‌లో విజ‌య‌సాయి అడుగుపెట్ట‌కుండా ఆయ‌న స‌భ్య‌త్వాన్ని వైఎస్ అనిల్‌రెడ్డితో భ‌ర్తీ చేస్తారంటూ తాడేప‌ల్లి ప్యాలెస్‌ వ‌ర్గాల స‌మాచారం.

వైఎస్ అనిల్‌రెడ్డికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం క‌ట్ట‌బెట్టేలా జ‌గ‌న్‌రెడ్డి ద్విముఖ వ్యూహం ర‌చించార‌ని అంటున్నారు. మెయిల్ టార్గెట్ విజ‌య‌సాయిరెడ్డి కాగా.. రెండో ల‌క్ష్యం వైఎస్ ఫ్యామిలీ ఇంప్రెష‌న్‌. వైఎస్ కుటుంబ స‌భ్యులు జ‌గ‌న్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నేది ఓపెన్ సీక్రెట్‌. బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డిని అంత దారుణంగా నరికి చంపినా.. హ‌త్య జ‌రిగి రెండున్న‌రేళ్లు అవుతున్నా.. సీఎంగా జ‌గ‌న్‌రెడ్డి ఉన్నా.. ఇప్ప‌టికీ హంత‌కులెవ‌రో తేల్చ‌క‌పోవ‌డం, శిక్షించ‌క‌పోవ‌డంపై ఫ్యామిలీ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. వివేకా కూతురు సునీత ప‌రోక్షంగా జ‌గ‌న్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఇక సొంత చెల్లెలు, జ‌గ‌న్ కోసం అంత క‌ష్ట‌ప‌డిన ష‌ర్మిల సైతం అన్న తీరు న‌చ్చ‌క‌.. నీకో దండం అంటూ మెట్టింటికి వెళ్లిపోయింది. కొడుకు కంటే కూతురే బెట‌ర్ అంటూ త‌ల్లి విజ‌య‌మ్మ సైతం జ‌గ‌న్‌ను వీడిపోవ‌డం మ‌రింత సంచ‌ల‌నం. ఇలా వైఎస్ ఫ్యామిలీలో ఏకాకిగా మారిన జ‌గ‌న్‌.. ఇప్పుడు వైఎస్ అనిల్‌రెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపించి కుటుంబ న‌మ్మ‌కాన్ని మ‌ళ్లీ చూర‌గొనాల‌నేది ఆయ‌న ప్లాన్ అంటున్నారు. 

రాజ్య‌స‌భ స‌భ్యత్వం రెన్యువ‌ల్ చేయ‌కుండా ఉండటమే కాదు.. త్వరలో పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పిస్తారని తెలుస్తోంది. ఇప్పటకే ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు విజయసాయి రెడ్డిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కొందరు సీఎం జగన్ కు కంప్లైంట్ చేశారు. అన్నింట్లోనూ సాయిరెడ్డి తలదూర్చుతుండటంతో తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాని సీనియర్ మంత్రులు రగిలిపోతున్నారట. సాయిరెడ్డి తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రికి చెప్పేశారట. దీంతో ఉత్తరాంధ్ర నుంచి విజయసాయిని గెంటేయడం ఖాయమంటున్నారు 

ఇక విజయసాయి రెడ్డి కోర‌ల‌న్నీ క‌ట్ చేస్తే.. ఆయన జ‌గ‌న్‌పై బుస కొట్ట‌కుండా ఉంటారా? అస‌లే ఆయ‌న కోసం జైలు కెళ్లిన త్యాగ‌శీలి.. త‌న‌ను ఇలా తొక్కేస్తూ స‌హించి ఊరుకుంటారా? ఇప్ప‌టికే బీజేపీ పెద్ద‌ల స‌హ‌కారంతో అధికార మార్పిడి కోసం తెర‌వెనుక‌ మంత్రాంగం నెర‌పుతున్నార‌నే ప్ర‌చారం ఉండ‌గా.. ఇలాంటి స‌మ‌యంలో పార్ల‌మెంట‌రీ పార్టీ నేత అయిన త‌న‌ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్నే లాక్కుంటే.. మౌనంగా భ‌రిస్తారా? అనేది ఆస‌క్తికరంగా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ..!