Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మావిగన్ వదిలేసి.. కమ్మరావతి అంటారేంటి విజయసాయీ!?
posted on: Apr 3, 2026 12:34PM
.webp)
విజయ్ సాయిరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఇన్నాళ్ల పాటు వ్యవసాయమే నా వ్యాపకం, జీవన పరమార్ధం అంటూ కబుర్లు చెప్పిన విజయసాయిరెడ్డి.. పార్లమెంటు అమారావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లును ఆమోదించిన వెంటనే సామాజిక మాధ్యమంలో క్యాస్ట్ రిలేటెడ్ పోస్టుతో రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలూ ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఇలా ఆమోదించాయో లేదో అలా ఆయన అమరావతి ని కమ్మరావతి కాకుండా చూసుకోండి ఫస్ట్ అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావించాలి. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. అసలు రాజకీయాలలోనే లేరు. వైసీపీకి రాజీనామా చేస్తున్నపుడు విజయసాయి ఇదే చెప్పారు. అన్నీ వదిలేసి తాను వ్యవసాయం చేసుకుంటానన్నారు.. అలాంటి వ్యవ-సాయిరెడ్డి అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేయడం వార్తల్లోకి రావడం తరచూ జరుగుతూనే ఉంది. బేసిగ్గా తాను రాజకీయ పార్టీ పెడతానో లేదో తెలీదుగానీ మీడియా సంస్థనైతే పెడతానని అన్నారు విజయసాయిరెడ్డి. అది కూడా ఎందుకులే.. ఖర్చు దండగ అనుకున్నారో ఏమో.. ఫ్రీగా ఒక ట్వీట్ పడేస్తే పోతుందనే కాడికి వచ్చేశారాయన.
నిజంగానే ఆయనకు తెలుగు సమాజం మీద అంతటి ప్రేమాభిమానాలే ఉంటే.. ఆ విధానం వేరుగా ఉండేది. ఇరవై నాలుగ్గంటలూ మీడియాను ఆడిపోసుకునే ఆయన.. ఈ రంగంలోకి దిగి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేవారు. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేదీ చేయకుండా కాసేపు జనసేన అధినేత నాకు ఎప్పటి నుంచో మిత్రుడనడం.. ఇదిగో ఇప్పుడు చూస్తే కమ్మరావతి అంటూ కామెంట్ చేసి.. కులాల కార్చిచ్చు రేపడానికి ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
నిజానికి వీరందరికీ ఎందుకింత కడుపు మంట అంటే, విశాఖ లో అయితే అడిగే వారే ఉండరు. అందుకు వైసీపీ అధికార సమయంలో ఆయన చేసిన భూ దోపిడీయే నిలువెత్తు సాక్షి. అందుకే అందరి అమ్మలాంటి అమరావతిపై ఇలాంటి కామెంట్లు చేసి.. విజయసాయి కడుపు మంట చల్లార్చు కుంటున్నారంటున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి అటు వాడే కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇటు వాడు కాడన్న మాట మరోమారు నిజమైందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



.webp)


