Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయసాయి రెడ్డి కొత్త పార్టీ.. జగన్ ను బ్లాక్ మెయిల్ చేయడానికేనా?
posted on: Aug 12, 2026 6:13PM

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారారు. ఇటీవల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఆయన అడుగులు మాత్రం రాజకీయంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నయని అనిపిం చకతప్పదు. దీనిపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ లో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫిలింనగర్ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేయడం, నూతన మీడియా సంస్థ స్థాపనకు యత్నాలు జరపడం ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారన్న సంకేతాలేనన్నారు.
తాజాగా భారత్ జన వికాస్ పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో వైసీపీకి లైజనింగ్ బాధ్యతలు చూసే సరైన నేత అవసరం ఉన్నందున, జగన్ పిలుపు కోసం ఈ సంకేతాలు పంపుతున్నారని విశ్లేషించారు.
కొత్త పార్టీ స్థాపన కాకుండా బిజెపి లేదా జనసేన వైపు విజయసాయి రెడ్డి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయన్న భరద్వాజ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ పార్టీలోకి వెళ్తారా లేక స్వతంత్రంగానే ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తారా అనేది చూడాల్సి ఉందన్నారు. మీడియా ఛానెల్ ఏర్పాటు ప్రక్రియ ద్వారా విజయసాయి, తనకంటూ ఒక వేదికను సిద్ధం చేసుకుంటున్నారన్నది వాస్తవమన్నారు.
Vijayasai Reddy New Party, Bharat Jana Vikas, YSRCP AP Politics, Vijayasai Reddy News Channel, AP Politics, TeluguOne


.webp)


