Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ్ మాల్యా మనిషే కాదన్న కోర్టు!
posted on: Sep 20, 2016 11:21AM
.jpg)
విజయ్ మాల్యా... ఈ పేరు నిన్న మొన్నటి దాకా ఓ సెన్సేషన్! విమానాల దగ్గర్నుంచి బికినీల్లో ఊరించే అమ్మాయిల దాకా మనోడి లైఫ్ స్టైల్లో అన్నీ సంచలనమే! మీడియా కూడా ఆహా ఓహో అంటూ ఆరాధించేది. ఇక రాజకీయ నాయకుల సంగతైతే సరేసరి! విజయ్ మాల్యాను తమకు సాధ్యమైనంత సత్కరించుకున్నారు అన్ని పార్టీల వారు! అందుకే, ఇండిపెండెంట్ గా రాజ్యసభ సీటు కొ్ట్టాడు మాల్యా! అంటే... అన్ని పార్టీలు కలిసి కింగ్ ఫిషర్ జాదూని గెలిపించాయన్నమాట!
విజయ్ మాల్యా రంగుల ప్రపంచం కళకళలాడినప్పుడు అందరూ ఆయన్ని హీరోని చేస్తే ఇప్పుడు అందరూ కామెడీ చేస్తున్నారు. టీవీల్లో, పేపర్లలో కాదు... ఏకంగా కోర్టు కూడా సెటైర్లు వేస్తుంది మాల్యాపై! తాజాగా బాంబే హై కోర్టు ఆయన కంపెనీ గుర్తుపై కామెంట్లు చేసింది. కింగ్ ఫిషర్ కంపెనీ లోగోలో వుండే బొమ్మ కింగ్ ఫిషర్ పక్షే! అది ఎక్కడికంటే అక్కడికి ఈజీగా ఎగిరిపోతుంది. ఎంత దూరమైనా ఆకాశంలో సాగిపోతుంది! అచ్చం మాల్యా లాగే...
అవును... విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ పక్షి లాగే రెక్కలు విప్పుకుని వెళ్లిపోయారు అన్నది కోర్టు! ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భరంగా జస్టిస్ కింగ్ ఫిషర్ పక్షిని మ్యాటర్ లోకి తెచ్చారు! దాని లాగే మాల్యా కూడా ఊడాయించాడని కామెంట్ చేశారు. అంతే కాదు, ఆ పక్షి, ఈ పక్షి ఇద్దరీకి దేశాలు, సరిహఃద్దులు తెలియవని సెటైర్ వేశారు! విజయ్ మాల్యా స్వంత విమానం వేలం వేయటం పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఆయన టోపి పెట్టిన బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖలు ఇప్పుడు ఆయన్ని డబ్బులు కక్కమంటూ వెంటాడుతున్నాయి. కాకపోతే, మన కింగ్ ఫిషర్ కింగ్ ప్రస్తుతం హ్యాపీగా లండన్ లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు!
విజయ్ మాల్యా చేసిన అప్పుల్లో లక్షో వంతు కూడా చేయని పేద రైతులు ప్రభుత్వాలకి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు మన దేశంలో! కాని, బికినీలు వేసుకున్న అమ్మాయిలతో కలిసి బీచుల్లో వేల కోట్ల రూపాయలు నీటిపాలుజేసిన మాల్యాని మాత్రం ... కోర్టు కూడా చీవాట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతోంది! జనం ఖర్మ...





