బిసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి..   కవిత కొత్తరాగం 

తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో తన పర్యటనలు అట్టర్ ప్లాప్ కావడంతో తాజాగా బీసీ నినాదం ఎత్తుకున్నారు. బతుకమ్మ ఈవెంట్ టార్గెట్ గా   ఏర్పాటైన జాగృతి సంస్థ  ఇపుడు బిసీ నినాదాన్ని ఎత్తుకుంది.    శుక్రవారం సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్బంగా బిఆర్ఎస్  పిలుపునిచ్చిన సభకు  తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బిసీలు గుర్తుకురాని కవిత సడెన్ గా బిసీ నినాదాన్ని ఎత్తుకున్నారు.  అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా లేదు. ఈ ఎన్నికలను వాయిదావేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది.  జనాభాలో  సగభాగం ఉన్న బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏమిటని ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ  గత ఎన్నికల సమయంలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని కాంగ్రెస్ పార్టీ మర్చిందని గుర్తు చేయడానికి స్థానికసంస్థల ఎన్నికల వేళ బిసీజెండాను ఎత్తుకుంది. బతుకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జాగృతి సంస్థ బతుకమ్మ వేడుకలను పూర్తిగా గాలికొదిలేసింది.  కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక  బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ ఆ ఊసే లెకుండా బతుకమ్మ సంబరాలను స్కిప్ చేశారు.  ఇపుడు తాజాగా బీసీ డెడికేషన్ కమీషన్  నివేదిక ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కవిత కొత్త రాగం అందుకున్నారు.  రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగడానికి వీల్లేదని కవిత హుంకరిస్తున్నారు. అప్పట్లో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నప్పుడు కూడా కవిత ఇదే విధంగా బిజెపితో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపారు. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం తెలంగాణ ప్రజానీకానికి   ఇంకా గుర్తుండే ఉంటుంది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కోర్టు ట్రయల్స్ కు హాజరైన సమయంలో కూడా కవిత జై తెలంగాణా నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల న్యాయస్థానం కవితకు అక్షింతలు వేసింది . తెలంగాణ ఉద్యమానికి లిక్కర్ స్కాంకు ఉన్న సంబంధం ఏమిటో కవితనే సమాధానమిస్తే బాగుంటుంది. తెలంగాణా రాజకీయాల్లో మోస్ట్ వపర్ ఫుల్ పొలిటిషన్ అయిన కవిత కామెడీ స్టార్ గా మిగిలిపోయారు.
Publish Date: Jan 2, 2025 8:02PM

నాగార్జున కొండలో విదేశీ బౌద్ధ పరిశోధకులు

చరిత్ర వివరించిన శివనాగిరెడ్డి  న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, తైవాన్ దేశాలకు చెందిన బౌద్ధ పరిశోధకులు గురువారం నాడు నాగార్జున కొండను సందర్శించారని పురావస్తు పరిశోధకుడు బుద్ధవనం కన్సల్టెంట్, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నాగార్జునకొండకు వచ్చిన న్యూజిలాండ్కు చెందిన ప్రొఫెసర్ సారా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రిషా ఇంకా హాంకాంగ్, తైవాన్లకు చెందిన ముగ్గురు పరిశోధకులకు శివనాగిరెడ్డి నాగార్జునకొండ మ్యూజియం లోని బౌద్ధ శిల్పాలు, శాసనాలు, సాగర జలాశయం ముంపు నుంచి తరలించిన బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు, వైదిక క్రతు వేదికలు శ్రీ పర్వత విజయపురిలోని ఇక్ష్వాకుల కట్టడాలు, ఆచార్య నాగార్జునుని రచనల గురించిన చారిత్రక వివరాలను తెలియజేశారు. మ్యూజియం అధికారి కమల్ హాసన్ బౌద్ధ పరిశోధకులకు నాగార్జునకొండ తవ్వకాలు మ్యూజియం నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆమోదం పురావస్తు అధికారి డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వనం అధికారులు డి ఆర్ శ్యాంసుందర్రావు, డాక్టర్ రవిచంద్ర పాల్గొన్నారు. 
Publish Date: Jan 2, 2025 6:50PM

బాపట్ల జిల్లాలో దారుణం...నడిరోడ్డుపై  భర్తకు ఉరేసి చంపేసిన అర్ధాంగి

భార్యా భర్తల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండనే ఉండవు. భర్త నేరం చేస్తే భార్య కేసులు నమోదు చేయడం సహజం. కానీ బాపట్ల జిల్లాలో ఓ భార్య భర్తపై కేసు పెట్టలేదు . కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లిందేమో భర్తకు ఏకంగా  మరణ శిక్ష విధించింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఉరేసింది. ఒక తాడును మెడలో వేసి  రోడ్డుపై ఈడ్చుకురావడంతో ఆ భర్త గిలా గిలా కొట్టుకుంటూ ప్రాణలొదిలాడు.  మరణ శిక్ష విధిస్తే చివరి కోరిక ఏమిటో చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ భార్య తన భర్తకు చివరి చాన్స్  కూడా ఇవ్వలేదు. మద్యానికి బానిస అయిన అమరేంద్రబాబు ను ఉరివేసి చంపేసింది.  వివరాల్లోకి వెళితే ఆంద్రప్రదేశ్  బాపట్ల జిల్లా    కొత్తపాలెం చెందిన అరుణతో గోకర్ణ మఠానికి చెందిన   అమరేంద్రబాబుకు పన్నేండేళ్ల క్రితం సాంప్రదాయబద్దంగా వివాహమైంది. హైదరాబాద్ లో హోంగార్డు ఉద్యోగం చేసే అమరేంద్రబాబు  నాలుగైదు సంవత్సరాల నుంచి మద్యానికి బానిసయ్యాడు. తరచూ తాగి భార్యను కొట్టేవాడు. ఇది భరించలేక అరుణ పుట్టింటికి వెళ్లిపోయింది. న్యూ ఇయర్ లో భార్యతో కలిసి ఉందామని డిసైడయ్యోడేమో అత్తారింటికి వెళ్లి భార్యను రమ్మన్నాడు.  అల్లుడు ప్రవర్తనకు విసిగిపోయిన అత్తింటివారు దాడి చేయడంతో అమరేంద్రబాబు  స్పృహ కోల్పోయాడు. అప్పటికే భర్త ను చంపాలని నిర్ణయించుకున్న అరుణ  భర్త మెడలో ఓ తాడు వేసి గట్టిగా గుంజేసింది. ఊపిరాడని స్థితిలో ఉన్న భర్తను రోడ్డు మీదకు ఈడ్చుకురావడంతో  ఊపిరాడక చనిపోయాడు . క్షణికావేశంలో భర్తకు మరణదండన విధించిన ఈ ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఏడడుగుల బంధానికి  మాయని మచ్చగా మారింది. 
Publish Date: Jan 2, 2025 5:48PM

అటవీ భూములనూ అప్పనంగా బొక్కేశారు.. వెలుగులోని సజ్జల కబ్జాల బాగోతం!?

వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌ అవినీతికి హ‌ద్దే లేదన్నట్లుగా సాగింది.  ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తన అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టేసింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలి కొదిలేశారు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత  2014లో తొలిసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దేందుకు త‌న‌ వంతు కృషి చేశారు. అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా ఏర్పాటు చేయ‌డంతోపాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించాడు. అవినీతి, అక్ర‌మాల‌కు తావులేకుండా ఐదేళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్లింది.  2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఒక్క చాన్స్ ప్లీజ్ అన్న జగన్ ను నమ్మి ఆయనకు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ముఖ్య‌మంత్రి చైర్‌లో కూర్చున్న మొద‌టి రోజు నుంచే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక్షేమాన్ని గాలికొదిలేసి.. రాష్ట్రాన్ని దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో స‌హా ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు, వైసీపీ ముఖ్య‌నేతలు ఐదేళ్ల కాలంలో ప్ర‌భుత్వ, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఐదేళ్లు మంత్రిగా కొన‌సాగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుటుంబం పెద్ద ఎత్తున  భూముల‌కు క‌బ్జాచేసింది.  పెద్దిరెడ్డి తన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వంద‌ల ఎక‌రాల భూముల‌ను క‌బ్జా చేశారు. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులు వారి అనుచరులు, బినామీల పేర్లతో దోచుకున్న‌ భూములకు లెక్కేలేదు. విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి భూదందా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల భూక‌బ్జాల ప‌ర్వం మూడుపువ్వులు ఆరు కాయ‌లుగా సాగింది. దీనికితోడు రేష‌న్‌ బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి కొంద‌రు  వైసీపీ నేత‌లు భారీ మొత్తంలో ప్ర‌భుత్వ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యాన్ని దేశం ఎల్ల‌లు దాటించి వంద‌ల కోట్ల‌ను వైసీపీ నేత‌లు ఆర్జించార‌ని ఆరోపణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేష‌న్‌ బియ్యం దోపిడీ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.  దీంతో ప్ర‌స్తుతం పేర్ని నాని, ఆయ‌న భార్య‌తోపాటు మ‌రో న‌లుగురిపై కేసులు న‌మోద‌య్యాయి. గోదాములోని రేష‌న్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు త‌ర‌లించి సొమ్ము చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే పేర్ని నానిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుటుంబం భూదందా వ్య‌వ‌హారం సైతం వెలుగులోకి వ‌చ్చింది.  వైసీపీ  హ‌యాంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క‌బ్జాల ప‌ర్వం ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకంగా అట‌వీ భూమిని సజ్జల క‌బ్జా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ  హయాంలో  ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా, జగన్ కు రైట్ హ్యాండ్ గా స‌జ్జ‌ల ఉన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ ఏప‌ని జ‌ర‌గాల‌న్నా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓకే చెబితేనే ఫైలు ముందుకు క‌దిలేది. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌జ్జ‌ల‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయి. త‌మ భూముల‌ను క‌బ్జా చేశార‌ని కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌లు ఫిర్యాదులు సైతం  అందాయి.  దీంతో వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఏకంగా 42 ఎక‌రాల అట‌వీ భూమిని క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. అందులో పండ్ల‌తోట‌లు, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారు. అంతే కాక అట‌వీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, ప‌నివారికోసం షెడ్లు క‌ట్టించారు. అయితే, స‌జ్జ‌ల పేరు బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న అండ‌తో  సోద‌రులు, కుటుంబ స‌భ్యులు అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు స‌మాచారం. వారంతా స‌జ్జ‌ల బినామీలేన‌ని ప్ర‌చారం జరుగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల సోద‌రులు క‌డ‌ప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చాయి.  సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధిలోని ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సోద‌రుడు దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు సందీప్ రెడ్డికి దాదాపు 130కిపైగా ఎక‌రాలు ఉన్నాయి. అయితే, సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధి స‌ర్వే నెంబ‌ర్‌ 1629లో 11వేల 129 ఎక‌రాల అట‌వీ భూమి ఉంది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ దీనికిలోని కొంత భూమిని ఆక్ర‌మించేశారు. ఇక్క‌డ స‌జ్జ‌ల ఎస్టేట్‌కు సంబంధించి మొత్తం 206 ఎక‌రాల భూమి ఉంది. ఇందులో ప‌ట్టాభూమి 147 ఎక‌రాలుకాగా..  ప్ర‌భుత్వం భూమి ప‌దెక‌రాలు, డీకేటీ ఆరు ఎక‌రాలు, చుక్క‌ల భూమి రెండెక‌రాలు ఉన్నాయి. ఈ స‌ర్వే నెంబ‌ర్ లోని అట‌వీ భూమిలో 42 ఎక‌రాల‌ను స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఆక్ర‌మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి ఇత‌ర వ్య‌క్తుల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బినామీల‌తో అట‌వీ భూముల్లో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశార‌ని స్థానికులు పేర్కొంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్ప‌టికీ ఆ భూములు రిజ‌ర్వ్ ఫారెస్ట్ ప‌రిధిలోనే ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన్యాక్రాంత‌మైన‌ అట‌వీ భూములపై ఫోక‌స్ పెట్ట‌గా స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ క‌బ్జాల ప‌ర్వం వెలుగులోకి వ‌చ్చింది. ఆ భూముల్లో అధికారులు స‌ర్వే చేయిస్తున్నారు. స‌జ్జ‌ల పేరుపైనా అక్క‌డ భూములు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి వివ‌రాల‌ను అధికారులు సేక‌రిస్తున్నారు. ప‌క్కా ఆధారాల‌ను సేక‌రించిన త‌రువాత స‌జ్జ‌ల‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొత్తానికి త్వ‌ర‌లోనే స‌జ్జ‌ల, ఆయ‌న కుటుంబ స‌భ్యులు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Publish Date: Jan 2, 2025 3:27PM

పిఠాపురంలో జనసేనాని నివాసం వద్ద ఫ్లెక్సీల సందడి!

కొత్త సంవత్సరం సందర్భంగా పిఠాపురంలోని జనసేనాని నివాసం వద్ద ఫ్లెక్సీలు సందడి చేశాయి. జనసేన మద్దతుదారులు, కార్యకర్తలకు 2024 గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆ పార్టీ ఎన్నికలలో అద్భుత విజయాన్ని సాధించడమే కాకుండా, పార్టీ అధినేత జనసేనాని పిఠాపురం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలోనూ, పార్లమెంటు స్థానంలోనూ విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ విజయాలతో ఆ పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. ఊరంతా జనసేన ఫ్లెక్సీలతో నిండిపోయింది. ముఖ్యంగా పిఠాపురంలోని జనసేన నివాసం వద్ద ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఫ్లెక్సీలలో పవన్ కల్యాణ్ పొటోతో పాటు ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా ఫొటోలు ఉండటం అందరూ ఆసక్తిగా చేసేలా చేశాయి. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  
Publish Date: Jan 2, 2025 3:15PM

 కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ  కేసులో హంతకుడు నాలుగో వ్యక్తి ?  

తెలంగాణతో బాటు ఎపిలో సంచలనమైన  కామారెడ్డి  ట్రయాంగిల్ సుసైడ్   ట్వి స్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు  చేసుసుకుంటున్నాయి.  వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి    సింధు శర్మ కు కంప్లయింట్ వచ్చినట్లు కథనాలు వచ్చాయి. గత బుధవారం కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పోలీసుశాఖకు చెందిన ముగ్గురు చనిపోయారు. వీళ్లు సుసైడ్ చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? అనేది  ఇంత వరకు తేలలేదు. వారం రోజులు ముగుస్తున్నా కేసు మిస్టరీ వీడటం లేదు. పెద్ద చెరువు వద్ద ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు నత్త నడకన కొనసాగుతోంది. బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ , బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి , కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిఖిల్, శృతి వాట్సాప్ చాట్ లో విషయం బయటపడినప్పటికీ సాయికుమార్ ఐ ఫోన్ డెడ్ కావడంతో  కాల్ డేటా ,చాటింగ్ వివరాలు బయటపడలేదు. వారం రోజుల నుంచి ఈ ఫోన్ ఎస్ పి కార్యాలయంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ ఫోన్ హైద్రాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు  చేరుకుంది. డెడ్ అయిన ఈ ఫోన్ కాల్ డేటా, చాటింగ్ వివరాలు తెలిస్తే దర్యాప్తు మరింత వేగంగా కొనసాగే అవకాశం ఉంది. చనిపోవడానికి ముందు వీరి ముగ్గురి మధ్య  పెద్ద చెరువు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.  మూడు వెర్షెన్ లలో  కథనాలు వినిపిస్తున్నాయి.  మొదటి వెర్షన్ ప్రకారం నిఖిల్ , శృతి వివాహానికి ఇష్టపడని సాయికుమార్ వీరిద్దరిపై దాడి చేసినట్టు ఓ కథనం ప్రచారంలో ఉంది. ప్రతిగా వీరిద్దరు సాయికుమార్ పై దాడి చేశారు. సాయికుమార్ శృతిని  నీళ్లలో తోసేసాడు.   ఆమెను కాపాడటానికి నిఖిల్ నీళ్లలో దూకినట్లు సమాచారం. వీరిద్దరు చనిపోవడంతో సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.  రెండో వెర్షన్ ప్రకారం ముగ్గురు మధ్య జరిగిన ఘర్షణలో సాయికుమార్ శృతిని కొట్టాడు . వెంటనే చెరువు గట్టు మీద పరుగెత్తి చెరువులో పడిపోయింది శృతి. ఆమెను కాపాడటానికి నిఖిల్ చెరువులో దూకేసాడు. వీరిని కాపాడటానికి  సాయికుమార్ నీళ్లలో దూకాడు. ముగ్గురికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు.   మూడో వెర్షన్ ప్రకారం సాయికుమార్, శృతి, నిఖిల్ వివాదంలో నాలుగో వ్యక్తి తల దూర్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. నాలుగో వ్యక్తికి శృతికి అత్యంత సన్నిహితుడు. గొడవ ముదరడానికి అతనే కారణమని మరో కథనం . ఈ నాలుగో వ్యక్తి ఆవేశంతో అరుపులు   ఎక్కువకావడంతో శృతి నీళ్లలో దూకింది. ఆమెను కాపాడటానికి  నిఖిల్  నీళ్లలో దూకాడు.    వీరిరువురిని కాపాడటానికి సాయికుమార్ నీళ్లలో దూకాడు. ఈత రాకపోవడంతో  మొత్తం ముగ్గురూ  చనిపోయారు.  ఎస్ పి సింధుశర్మ వద్దకు నిఖిల్ కంప్లయింట్ ఉన్నవార్తలను పోలీసు శాఖ గురువారం ఖండించింది. స్వయంగా   సింధూశర్మ ఈ విషయాన్నివెల్లడించారు. నా వద్ద ఈ వివాదానికి సంబంధించిన సమాచారం లేదు. క్రింది స్థాయి అధికారులకు కంప్లయింట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఎస్ పి కార్యాలయంలో సిసిటీవీ కెమెరాలు ఎందుకు పని చేయలేదో అనేది సింధుశర్మ చెప్పలేకపోయారు. కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు రోజుకో సవాల్ ను ఎదుర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ సుసైడ్ కేసు పురోగతి సాధించకపోవడానికి సాక్ఖ్యాధారాలు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి సాయికుమార్ తన కారులో   టోల్ గేట్ దాటే విజువల్స్ కీలక ఆధారం. ముగ్గురు వేర్వేరుగా వచ్చి చెరువువద్ద ఎందుకు గొడవపడ్డారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు వచ్చారా? వీరిలో ఎవరు హంతకులు అనేది తేలడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు సస్పెన్స్ వీడే అవకాశం లేదు. 
Publish Date: Jan 2, 2025 2:42PM