గవర్నర్ ఆమోదిస్తే నన్ను అరెస్ట్ చేయండి: కెటీఆర్ 

తనను అరెస్ట్ చేస్తారన్న వార్తలపై మాజీ మంత్రి కెటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైద్రాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల నిధులు మళ్లించడానికి కేబినేట్ అనుమతి అవసరం లేదని  ఆయన అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హైద్రాబాద్ ప్రతిష్టను పెంచడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఈ రేస్  ఒక కుంభకోణం అని ప్రచారం చేస్తుందన్నారు. ట్రై పార్టీ ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేస్  ప్రతీ యేడు నిర్వహించేలా ప్రభుత్వం  ఒప్పందం చేసుకుందన్నారు. బిఆర్ఎస్ కు ఖ్యాతి రాకుండా చేయడానికే ఈ ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రర్దు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్ట పోయిందన్నారు. 
Publish Date: Nov 7, 2024 5:18PM

నిర్లక్ష్యపు నీడలో ఇనప యుగపు నిలువు రాయ

కాపాడుకోవాలంటున్న శివనాగిరెడ్డి  నాగర్ కర్నూలు జిల్లా, ఉప్పునుంతల మండలం, కంసానిపల్లె శివారులో దిండి నది ఒడ్డున ఇప్పటికి 3500 సంవత్సరాల నాటి ఇనుపయుగపు నిలువు రాయి నేడోరేపో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ సంపదను కాపాడుకొని, భవిష్యత్ తరాలకు అందించాలన్న ధ్యేయంతో చేపట్టిన అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం నాడు ఉప్పునుంతల మండల పరిసరాల్లో జరుపుతున్న అన్వేషణలో కొండారెడ్డిపల్లి- ఉప్పునుంతల మార్గంలో దిండినది దాటిన తర్వాత కుడివైపు 100 అడుగుల దూరంలో పొలాల్లోనున్న నిలువు రాతిని ఇనుప యుగంలో మరణించిన ఒక  ప్రముఖుని గుర్తుగా నిర్మించారని, దీన్ని మెన్హీర్ అంటారని ఆయన అన్నారు. ఇంతకు మునుపు ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్లను గుండ్రంగా అమర్చిన అనేక సమాధులు ఉండేవని, వ్యవసాయ భూముల విస్తరణలో అవి తొలగించబడినాయని స్థానిక రైతులు చెప్పారని, ఈ నేపథ్యంలో మిగిలిన ఒకే ఒక నిలువు రాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శివనాగిరెడ్డి అన్నారు. భూమిపైన 8 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు, అడుగున్నర మందం గల ఈ నిలువు రాయి, గ్రానై టు రాతితో తీర్చిదిద్దబడిందని, ఇంత పెద్ద నిలువు రాతిని నిలబెట్టడం అలనాటి సామూహిక శ్రమశక్తికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి జగన్మోహన్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, బడే సాయికిరణ్ రెడ్డి పాల్గొన్నారని ఆయన చెప్పారు.
Publish Date: Nov 7, 2024 4:42PM

గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

వైసీపీ గుంటూరు-కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆరోపించిన ఆ పార్టీ, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశాలు లేవని పేర్కొంది. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేనందను ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు  వైసీపీ నాయకుడు పేర్ని నాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   పాకిస్థాన్ తీవ్రవాదులను అరెస్టు చేసినట్లుగా వైసీపీ కార్యక్తలను వేధిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో  ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారంటేనే రాష్ట్రంలో పాలన ఏ రీతిన  సాగుతోందో అవగతమౌతోందని పేర్ని నాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.   అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ బహిష్కరణ ప్రకటనను ఎద్దేవా చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణా- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి జీరో రిజల్ట్ వచ్చిందనీ, ఇప్పడు ఆ పార్టీకి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని, అందుకే ఎన్నికలలో పోటీకి నిలబడకుండా పలాయనం చిత్తగిస్తోందనీ తెలుగుదేశం పేర్కొంది. 
Publish Date: Nov 7, 2024 1:52PM

 శ్రీకాళ హస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శ్రీకాళహస్తి దేవాలయంలో హైడ్రామా క్రియేట్ చేశారు. దేవాలయంలో ప్రవేశించే సమయంలో అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం వివస్త్రను అనుమతించబోమని చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. అఘోరీలు వివస్త్రగానే దేవాలయంలో ప్రవేశిస్తారని అక్కడున్న సిబ్బందికి తెలిపారు. అయినా వినకపోవడంతో అక్కడ్నుంచి తన కారు వద్దకు వెళ్లి   క్యాన్లో ఉన్న పెట్రోల్ వంటిపై పోసుకున్నారు. కారుపై కూడా పెట్రోల్ చల్లడంతో హైటెన్షన్ నెలకొంది. సిబ్బంది  అఘోరీపై నీళ్లు గుమ్మరించి వస్త్రాలు తొడిగారు. పెద్ద పెద్దగా అఘోరీ కేకలు వేయడంతో దేవాలయానికి సంబంధించిన అంబులెన్స్ లో అఘోరీని కూర్చొబెట్టారు. అక్కడ్నుంచి  ఎపి బార్డర్ తరలించారు. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తికి తమిళనాడు దగ్గర కావడంతో అంబులెన్స్ చెన్నయ్  వైపు వెళ్లినట్లు సమాచారం. మంచిర్యాల నుంచి తెలంగాణ బార్డర్ దాటించిన పోలీసులు తాజాగా ఎపి పోలీసులు తమిళనాడు పంపించడంతో తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హైడ్రామా ముగిసినట్టయ్యింది. 
Publish Date: Nov 7, 2024 1:43PM

తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం స్వీకరించిన టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు బుధవారం (నవంబర్ 6)  ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టగానే అలా తిరుమల పవిత్రతను కాపాడే విషయంపై దృష్టి సారించారు. జగన్ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబారిన సంగతి తెలిసిందే. తిరుమల కొండపై పారిశుద్ధ్యం, పవిత్రత విషయంలో గత టీటీడీ బోర్డు ఇసుమంతైనా దృష్టి పెట్టలేదు. కొండపై హోటళ్లలో నాణ్యత తగ్గిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం కూటమి కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమలపై పరిస్థితులు చాలా వరకూ మెరుగుపడ్డాయి.  ఈ నేపథ్యంలోనే తిరుమలలో పరిస్థితులను స్వయంగా పరిశీలించి పర్యవేక్షించాలని టీటీడీ బోర్డు కొత్త చైర్మన్ బీఆర్ రాయుడు నిర్ణయించుకున్నారు. అందులో బాగంగా బుధవారం (నవంబర్ 6) రాత్రి తిరుమల శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని ఆయన సందర్శించారు. సకుటుంబ సమేతంగా సామాన్య భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద భవనంలో కార్యకలాపాలను టీటీడీ ఈవో రాజేంద్ర చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒక రోజులో ఎంత మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తారు. అన్న ప్రసాదంలో అందించే పదార్ధాల వివరాలు, పని వేళల గురించి చైర్మన్ సావధానంగా విని తెలుసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.      
Publish Date: Nov 7, 2024 1:32PM

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

  మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. మల్లారెడ్డి విద్యాసంస్థలపై  పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పూలమ్మినా, పాలమ్మినా అంటూ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ తో బాగా పాపులర్ అయిన మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై గత ఏడాది జూన్ నెలలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన విద్యాసంస్థల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతోసోదాలు నిర్వహించిన   ఈడీ  ఆ సందర్భంగా కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లనూ కూడా అప్పట్లో ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తాజాగా గురువారం (నవంబర్ 7)న నోటీసులు జారీ చేసింది. అప్పట్లో పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగాలపై ఈడీ మబల్లారెడ్డి వివరణ కో రింది. తాజాగా నోటీసులు జారీ చేసింది. 
Publish Date: Nov 7, 2024 1:13PM