Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కౌంటర్ ఇచ్చేశాడుగా... రోడ్ల మీద తిరుగుతారా..?
posted on: Oct 14, 2017 10:49AM

అనుకున్నదే జరిగింది. వాణి విశ్వనాథ్ కు వర్మ కౌంటర్ ఇవ్వనే ఇచ్చాడు. ఇప్పటికే వర్మ తీయబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గాను పలు వివాదాలు తలెత్తాయి. టీడీపీ నేతలు వర్మ పై పలు విమర్శలు గుప్పించారు. వాళ్లకి తోడు వాణి విశ్వనాథ్ కూడా ఈ సినిమాపై స్పందించి... తెలుగు ప్రజల మనసులో ఆయన ఓ రాముడిగా, కృష్ణుడిగా ముద్రవేసుకున్నారు. ఆయన జీవితం గురించి బాలకృష్ణ ఓ చిత్రాన్ని తీస్తున్నారు. అది గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి కాబట్టి ఎన్టీఆర్‌ను దేవుడిలాగానే చూపిస్తారు. కానీ, రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై అనుమానాలున్నాయి. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాన్ని వర్మ వెంటనే విరమించుకోవాలి. ఎన్టీఆర్‌కు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతా.. అని వార్నింగ్ ఇచ్చారు.
ఇక దీనికి వర్మ ఊరుకుంటాడా... వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా....అప్పుడు, మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?’ అని వర్మ చమత్కరించారు. మరి ఈ దుమారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా..? లేక కంటిన్యూ అవుతుందా... చూద్దాం..


.jpg)



