వల్లభనేని వంశీకి చుక్కెదురు... బెయిల్ పిటిషన్ కొట్టివేత 

వైసీపీ నేత,  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  సిఐడి  కోర్టులో  చుక్కెదురైంది.   కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ  బెయిల్ పిటిషన్ ను  దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా  బెయిల్ ఇవ్వాలని  కోర్టుకు  ఆయన తరపు న్యాయవాది విన్నవించుకున్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వడం వల్ల  సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సీఐడీ తన వాదనలు వినిపించింది. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడు. 
ఈ నేపథ్యంలో  తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి. గురువారం తీర్పును వెలువరించారు. వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు.  వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించారు.