Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాట స్టాలిన్‌కు వైగో షాక్!
posted on: Jun 18, 2026 3:28PM
.webp)
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. వైకో టీవీకే అధినేత, సీఎం విజయ్‌ను కలవడం, విజయ్ నాయకత్వంపై ప్రశంసులు కురిపించడం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో టీవీకే మరింత అద్భుత ఫలితాలు సాధిస్తుందని వైకో వ్యాఖ్యానించడం స్టాలిన్ శిబిరంలో కలకలం రేపుతోంది. తాజాగా వైకో, విజయ్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో విజయ్ మ్యాజిక్ చేసే అవకాశముందని వైకో అభిప్రాయపడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించిన వైకో, ఇటీవల ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్కులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌తో కలిసి నాలుగు స్థానాల్లో పోటీ చేశారు. రెండో స్థానాల్లో ఎండీఎంకే అభ్యర్ధులు గెలిచారు. అయితే కొంతకాలంగా ఎండీఎంకే నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. వైకో కుమారుడు ఎండీఎంకే కీలక నేత దురై వైకో ఇటీవల టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. వైకో వంటి సీనియర్ ద్రవిడ నాయకుడు విజయ్‌ని బహిరంగంగా ప్రశంసించడంతో రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రస్తుతం వైకో డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఆయన స్టాండ్ ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎండీఎంకే నిజంగానే డీఎంకే కూటమిని వీడి టీవీకేతో జతకడితే, అది స్టాలిన్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. విజయ్‌కి ద్రవిడ రాజకీయాల్లో మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.






