Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 చంద్రబాబుతో తొలి ఎపిసోడ్?
posted on: Oct 19, 2024 3:06PM

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ 4వ సీజన్ రెడీ అయ్యింది. తొలి మూడు సీజన్లూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు సినిమాలలోనూ బాలయ్య అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకు పోతున్నారు. మరో వైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇక తన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపారేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. గత మూడు సీజన్లకు మించి ఈ నాలుగో సీజన్ ఉంటుందని అంటున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అప్పటికి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ లో కూడా పాల్గొంటున్నారు.
అన్ స్టాపబుల్ 2 షోలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభం నాటి పరిస్థితులపై మాట్లాడారు. నాటి సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారకులు వంటి విషయాలపై వివరంగా చెప్పారు. చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఈ కార్యక్రమంలో ఎలాంటి శషబిషలకూ తావులేకుండా వివరించారు. మరీ ముఖ్యంగా 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి సంబంధించి విమర్శలను భరించారు. 1995 పరిణామాల అనంతరం ఎన్టీఆర్ కుటుంబం మొత్తం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం చంద్రబాబు వెనుక నిలబడటం ద్వారానే నాడు అది రాష్ట్ర భవిష్యత్ కు, ప్రగతికి, పురోగతికి, అభివృద్ధికి అనివార్యం అని నిరూపితమైంది. అలాగే 1999 ఎన్నికలలో ప్రజలు కూడా చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టడం ద్వారా చంద్రబాబు విధానాలకు ఆమోదముద్ర వేశారు. అయినా కూడా వెన్నుపోటు విమర్శను ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆ విమర్శలను ఖండిస్తూ, లేదా నాటి పరిస్థితులను వివరిస్తూ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. అందరూ సమష్టిగా చంద్రబాబు వెంట నిలవడం ద్వారా తామేమనుకుంటున్నామో చెప్పకనే చెప్పారు.
అయితే వారి మౌనాన్ని ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుని ఇన్నేళ్లుగా సందర్భం వచ్చినా, రాకున్నా, సమయం అయినా కాకున్నా.. అవే విమర్శలు గుప్పిస్తూ వికృతానందం పొందుతూ వచ్చారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 తొలి ఎపిసోడ్ లో వారి విమర్శలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టక తప్పని రీతిలో చంద్రబాబు బాలయ్య చేతే సమాధానం చెప్పించారు. ఇప్పుడు మళ్లీ బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ కు కూడా చంద్రబాబు హోస్ట్ గా రానున్నారు. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్ లో ఆదివారం జరగనుంది. ఇదే కాకుండా ఈ సీజన్ లో అల్లు అర్జున్, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ కూడా రానున్నారు. ముఖ్యంగా నాలుగో సీజన్ లో అల్లు అర్జున్ పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికలలో కూటమి అభ్యర్థికి వ్యతి రేకంగా వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ నిర్వహించిన రోడ్ షో అనంతరం అల్లు ఏం మాట్లాడతారా అన్నదానిపై అన్ని వర్గాలలోనూ ఆసక్తి నెలకొని ఉంది.






