వారానికి నాలుగున్నర రోజులే పని.. అక్కడి ఉద్యోగులకు పండగే!  

ఉద్యోగులకు మన దేశంలో ప్రస్తుతం వారానికి ఆరు రోజుల పని ఉంది. కొన్ని సంస్థల్లో మాత్రం ఐదు రోజుల పని దినాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఆరు రోజులు, ఐదు రోజుల పని దినాలు అమలవుతున్నాయి. ఐటీ సెక్టార్ లో ఐదు రోజులు మాత్రమే ఉద్యోగులు వర్క్ చేస్తారు. శని, ఆది వారాలు సెలవు. తాజాగా ఉద్యోగుల పనిదినాల విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు నాలుగున్నర రోజులే పనిదినాలు ఉంటాయని ప్రకటించింది. 

ఇప్పటిదాకా యూఏఈలో ఐదు రోజుల పనిదినాలు ఉండేవి.  శని, ఆదివారాలు సెలవు. అయితే ఇక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే విధులు ఉంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారాంతపు సెలవులు మొదలవుతాయి. ఇకపై అక్కడి ఉద్యోగులకు వారానికి రెండున్నర రోజులు సెలవులుగా లభిస్తాయి. ఈ నూతన విధానం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని యూఏఈ పాలకవర్గం ప్రకటించింది. 

Related Segment News