Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐపీఎల్ నిబంధనల మేరకు బెన్ డకెట్ పై రెండేళ్ల నిషేధం?
posted on: Mar 26, 2026 1:07PM

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ పై ఐపీఎల్ రెండేళ్ల నిషేధం విధించనుందా? అంటే క్రీడా పండితులు ఔననే అంటున్నారు. వ్యక్తిగత కారణాలు చూపుతూ బెన్ డకెట్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొని అమ్ముడైన తరువాత సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకునే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా ఐపీఎల్ ఇటీవల నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల మేరకు ఈ ఏడు ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన బెన్ డకెట్ పై రెండేళ్ల నిషేధం అనివార్యమని అంటున్నారు. విషయం ఏమిటంటే.. వ్యక్తిగత కారణాలు, యాషెస్ సన్నద్ధత కారణాలుగా చూపుతూ ఈ ఏడు ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు బెన్ డకెట్ ప్రకటించాడు.
గత ఏడాది జరిగిన మినీ వేలంలో బెన్ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం 2 కోట్ల రూపాయల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే, తాజాగా డకెట్ సోషల్ మీడియా వేదికగా తాను ఈ టోర్నీలో భాగం కాలేకపోతున్నానని ప్రకటించాడు. ఢిల్లీ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెప్పాడు. తన నిర్ణయం జట్టుకు ఇబ్బంది కలిగించినా, తన కెరీర్ దృష్ట్యా అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్న డకెట్ రాబోయే టెస్టు సిరీస్‌లలో ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం కోసం శారీరకంగా, మానసికంగా సన్నద్ధం కావడం కోసమే ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు.
అయితే, ఐపీఎల్ కొత్త నిబంధనల మేరకు వేలంలో అమ్ముడైన ఏ ఆటగాడైనా ఆరోగ్య కారణాలు లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే, వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. ఇప్పుడు బెన్ డకెట్ ఆరోగ్య కారణాల దృష్ట్యా కాకుండా.. పనిభారం, సన్నద్ధత అంటూ ఐపీఎల్ నుంచి తప్పుకున్నందున అతడిపై రెండేళ్ల నిషేధం తథ్యమని అంటున్నారు.
గతంలో ఆటగాళ్లు వేలంలో అమ్ముడైన తర్వాత చివరి నిమిషంలో తప్పుకోవడం వల్ల ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయేవి. ఈ ధోరణిని అరికట్టడానికే బీసీసీఐ ఈ కఠిన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే బెన్ డకెట్ నిర్ణయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకులాట ప్రారంభించింది.



.webp)


