Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాట టీవీకే విజయ్ ఫ్రీ పాలిటిక్స్
posted on: Apr 17, 2026 11:01AM
.webp)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500లు చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల రుణాలను 50 శాతం మాఫీ చేస్తామన్నారు. అలాగే ఓ కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు . అలాగే కొత్తగా ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3 వేలు పింఛను ఇస్తామన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని విజయ్ హామీల వర్షం కురిపించారు. అలాగే మహిళలు తమ ఇళ్ల ముందు టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్ ముగ్గు వేయాలని సూచించారు.





