కేసీఆర్ సారూ.. వీటికి జవాబు ఇవ్వండి సారూ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, “కేసీఆర్ సారూ ... వీటికి జవాబు చెప్పడి” అంటూ కొని ప్రశ్నలు సంధించారు. నిజానికి బండి సంజయ్,ఈ బహిరంగ ప్రశ్న పత్రంలో కీసీఆర్ సారును అడిగిన ప్రశ్నలలో కొత్తదనమేమీ లేదు. ముఖ్యమంత్రి సారును ... పెద్దగా చికాకు పెట్టే ప్రశ్నలు కొద ఏమీ లేవు. అలాగే, జగమెరిగిన బ్రాహ్మణుడికి ఎవరో వచ్చి ధన్జ్యం వేసి నట్లు, ‘కేసీఆర్ జమానా – అవినీతి ఖాజానా’ అని బండి సంజయ్ టం ప్రశ్న పత్రానికి ఒక మకుటం కూడా చేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభత్వం అవినీతి గురించి, ఈరోజు కొత్తగా చెప్పుకోవలసింది లేదు. తెలంగాణలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏదైనా ఉందంటే, అది కల్వకుట్ల ఫ్యామిలీ అవినీతే. ఇది అందరి మాటగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో రోజూ ఎదో ఒక రూపంలో వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు రోజూ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎవరిదాకానో ఎందుకు స్వయంగా బండి సంజయ్, తమ ప్రశ్న పత్రంలో వేసిన  ప్రశ్నలు, చేసిన ఆరోపణలను గతంలోనూ అనేక సంధర్భాలలో వేసిన ప్రశ్నలే, చేసిన ఆరోపణలే. 

ఒక్క బండి సంజయ్ మాత్రమే కాదు  సెప్టెంబర్ 17 న కేంద్ర హోమ్ మంత్రి  అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హోమ్ మంత్రి సమయమిస్తే కేసీఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలను అందచేస్తానని చెప్పారు. అలాగే అసెంబ్లీ లోపలా వెలుపలా కూడా ప్రభుత్వ అవినీతికి సంబందించి అనేక సందర్భాలలో అనేక ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి  ఫిర్యాదులు అందాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మొదలు, రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు అందరూ కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి గూర్చి మాట్లాడుతూనే ఉన్నారు. అయినా చర్యలు లేవు ... అందుకే, బీజేపీ చేసే ఆరోపణలకు విలువలేకుండా పోయిందని పరిశీలకులు భావిస్తున్నారు., బీజేపీ ప్రత్యర్ధి  పార్టీలు కూడా. గల్లీలో కుస్త్తే  ఢిల్లీలో దోస్తీ’ అని ఎద్దేవా చేస్తున్నాయి. 

బండి సంజయ్ తాజాగా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మొత్తం పది ప్రశ్నలు సంధించారు. అయితే అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు, ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు, అలాగే కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి సంబంధించి, కూడా లోతుల్లోకి పోనవసరం లేదని రాజాకీయ విశ్లేషకులు అంటున్నారు. 2001లో తెరాస ఆవిర్భావం నాటికి, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? 2014లో కేసీఆర్ ముఖ్యమంతి అయ్యేనాటికి అయన, అయన, అయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడు (2021) నాటికీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ ఎంత? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం రాబట్టగలిగితే, బండి సంజయ్ లేవనెత్తిన, పది ప్రశ్నలకు సమాధానం చ్గిక్కేస్తుంది. కేసీఆర్ కుటుంబ ఆస్తులు లక్ష రెట్లు పెరిగాయా, లేక ఇంకా ఎక్కువ పెరిగాయా అనే ప్రశ్నతో పాటుగా  అన్ని ప్రశ్నలకు సమాధానం చిక్కేస్తుందని, అంటున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరిట అంచనా వ్యయాన్ని పెంచి ప్రజాధనాన్ని కొల్లగొట్టారా లేదా అని  అడిగితే కేసీఆర్ నిజం చెపుతారా? ఇనవరకు అడిగిన ననూటొక్క మందిలో ఏ ఒక్కరికైనా ఆయన సమాధానం చెప్పరా? ఇదే విషయంగా కదా, కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది, దానికి సమాధానంగా ముఖ్యమంత్రి ఏకంగా సభలోనే పవర్  పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే కాని, అవినేతిని ఒప్పెసుకున్నారా? కేసీఆర్  అంత అమాయకుడా, అలాగే, మిషన్, కాకతీయ, మిషన్ భగీరథ, పాలమూరు – రంగ రెడ్డి ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు,  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇలా  వివిధ ప్రాజెక్టులలో అవినీతి జరిగింది .. ఇందుకు సంబందించిన ఫైల్స్, పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి చర్చకు వస్తారా, అంటే, కేసీఆర్ వస్తారా .. అయినా, రాజకీయ నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఫలితం ఉంటుందా? ఉండదనే కదా చరిత్ర చెపుతోంది. 

నిజానికి కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఆర్థిక అవినీతి మాత్రమే కాదు, దానికి తోడుగా అనుబంధంగా రాజకీయ అవినీతి కూడా పెరిగి పోయింది . బండి సంజయ్ తమ లేఖలో ప్రస్తావించిన విధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను, చివరకు సొంత పార్టీ  సహా, అన్నిపార్టీల స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది నిజం ..  రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగు దేశం, కాంగ్రెస్ శాసనసభ పక్షాలను టం పార్టీలో విలీనం చేస్కున్నారు. ఇతర పార్టీలో గ్లిచిన అరిని మంత్రివర్గంలోకి తీసుకునంరు.. ఇలా అనేక విధాల తెరాస రాజకీయ అవినీతికి పాల్పడింది నిజం. ప్రజాస్వామ్య వ్యవస్థలను, చివరకు సమాజాన్ని అవినీతిమయం చేసింది నిజం. కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే కాదు, ఆయన బందుమితులు అందరూ అవినీతి సామ్రాజ్యంలో భాగస్వాములే ..లెక్క సరిగా గుర్తులేదు కానీ, ఈ ఏడేళ్ళలో కల్వకుట్ల అండ్ కో పేరున ఎన్నో కంపెనీలు పుట్టు కొచ్చాయని సోషల్ మీడియాలో ఎన్నో కధనాలు వచ్చాయి. సో ... ఇప్పుదు తేలవలసింది, తెలుసుకోవలసింది, కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందా లేదా అనేది కాదు.. అందులో ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు .. అలాగే, కేసీఆర్ దేశంలోనే అత్యంత ధనిక పొలిటీషియన్ అన్నా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇప్పడు చర్చలు అనవసరం, విచారణ జరిగి .. నిజం ఏమిటో బయటకు రావడం అవసరం. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.. అదీ ఇప్పుడు తెలవలసింది.. కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందా ... న్యాయ వ్యవస్థ నడుబిగిస్తుందా .. చివరకు ప్రజలే ఉద్యమిస్తారా లేక ... ఇదే వరస కొనసాగుతుందా? ఇవి ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలు..