గిరిజన మహిళల ఆరోగ్యానికి మీ గళం వినిపించండి

గిరిజన ప్రాంతాలలో మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. శరీరకంగా మానసికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పౌస్టిక ఆహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు .ప్రతి రోజూ వారు తీసుకునే ఆహారంలో పోషక లోపం ఉన్న ఆహారం తీసుకోడమే కారణం.జీవన ప్రమాణం తక్కువగా ఉండడం మరోసమస్య  గిరిజన ప్రాంతాలలో అత్యవసర  సమయంలో పెనుసవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది .వెనుక బడిన గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఆరోగ్య సమస్యలే పెద్ద సవాల్ గా మారింది. ఇందులో కొన్ని యదార్ధాలు  గుర్తించారు. మహిళలకు ఆరోగ్యం పై కనీస  అవగాహన లేక పోవడం కనీస విద్య లేకపోవడం . ఆర్ధికంగా, సాంఘికంగా బలహీనంగా  ఉండడం. పౌష్టికాహార లోపం, కొన్ని సాంప్రదాయ మూడనమ్మకాలు తరచుగా అనారోగ్యం లో మార్పులు లైంగిక సమస్యలు ఆరోగ్య వృద్ధి సాధ్యం కావడం లేదనేది నిపుణుల ఆంచనా.

ఆరోగ్యం విషయంలో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం...

స్త్రీపురుషుల ను వేరు వేరుగా చూడడం స్త్రీలలో పోష్టికాహార లోపం నేరుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారి సాంస్కృతిక కళా ప్రదర్శనల సాధనకు సాంఘిక, ఆర్ధిక ప్రభావం ఉంటుంది.పౌష్టికాహార 
లోపం చాలామంది మహిళలో సంతాన ఉత్పత్తి వారు వాడే ఆహారం లో బలమైన పోషకాలు లేకపోవడం 
తీవ్ర ఒత్తిడికి  అవుతున్నారు. పోషకాహార లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పై అధ్యయనం చేశారు సరైన సంతాన ఉత్పతికి సరైన పోషక విలువలు ఉన్న ఆహారం వారి అలవాట్లు నిర్లక్ష్యం చేయడం వల్లే స్త్రీలను సంరక్షించడం సాధ్యం కాక పోవడాన్ని గమనించారు. అదనంగా సాంస్కృతిక ఉనికి తో పాటు సంతాన లేమి సమస్యలు ఎక్కువగా ఎదుర్కుంటున్నారు. దీనికి  కారణం శరీరంలో పోషకాహార లోపం మారోకారణం.గర్భిణిగా ఉన్నప్పుడూ సమస్యలు ఎదుర్కుంటున్నారు. పిల్లల పుట్టుకలోను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఒక పరిశోదన ప్రకారం 1 5 -24 సంవత్సరాల మధ్య ఉన్న  గ్రామీణ ప్రాంతాలలో శరీరకంగా లైంగిక అవగాహన లేనందు వల్లే 41% మండి మహిళలు పురిటి సమయంలో జన్మ నిచ్చే సమయంలో మరణిస్తున్నారు. అని అధ్యయనం వెల్లడించింది. అందుకే స్త్రీలు తప్పనిసరిగా పౌష్టిక ఆహారం, ఆరోగ్య కరమైన జీవన శైలి ముందునుంచే అలవరచుకోవాలి. సంతాన లేమి తో బాధ పడేవారు గర్భవతిగా ఉన్నప్పుడూ  ప్రసవించే సమయంలో ఆరోగ్యంగా ప్రసవించడం పుట్టిన బిడ్డల సంరక్షణ అవసరం. ఇందుకు ఉదాహరణగా శ్రీనివాసన్ ట్రస్ట్ సేవలు ఒక ద్విచక్రాల వాహన కంపెనీ ఇ కామ్ ఫౌండేషన్ సంస్థ సమన్వయంతో ఆరోగ్యం గా ఎలా ఉండాలో అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. గర్భస్థ సమయంలో ప్రసవించిన అనంతరం ప్రశవానికి ముందు ప్రసవ అనంతరం తీసుకోవాల్సిన 23 గ్రామాలలో ని స్త్రీలలో నీల గిరిజనుల  స్వయం సహాయక బృందాలు, ఆశావర్కర్లు, అంగన్ వాడి, కార్యకర్తలు బాల బాలికలు యువతులకు సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు గర్భిణిగా ఉన్నసమయంలో ప్రసవ ఆనంతరం తీసుకోవాల్సిన అనారోగ్య సమస్యలపై అవగాహన  కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజా ఆరోగ్యం కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు గిరిజన ప్రాంతాలలో అవగాహన తీసుకోవాల్సిన మందులు దీని ఫలితంగానే  పలు సమస్యలు తెలుసుకోడం సాంప్రదాయ పద్దతుల నుండి బయటపడి ఇక ఆసుపత్రులకు వెళ్ళడం మొదలు పెట్టారు.అంగన్  వాడి ఐ సి డి ఎస్ ట్రస్ట్ ద్వారా వారిలో ఆర్ధికంగా, సామాజికంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.శ్రీనివాస్ ట్రస్ట్ సేవలు గిరిజన మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత బాల బాలికలు విద్యార్ధులు సరిపడ  టాయిలెట్స్  స్కూళ్ళలో లేకపోవడాన్ని మూత్ర శాలలను రిపేర్ చేశారు.ఈ యజ్ఞంలో 100 పాటశాలలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు కల్పించింది.

గత సంవత్సరం గిరిజనులు, మహిళలకు, విద్య, వైద్యం, పై దృష్టి పెట్టింది . దానివల్ల నాణ్యమైన జీవన శైలి పెంచేందుకు  తమిళ నాడుకు చెందిన గ్రామాలలో రాగి మాల్ట్, చృధాన్యాలు, తృణ ధాన్యాలు, సామలు, పల్లీలు, ఆయా కుటుంబ ఆరోగ్యం పై సమీక్షించారు.రక్త హీనత, సమాస్యలకు సౌకార్యాలను కల్పించి నూతన ఆహార పద్దతులు అలవారుచుకున్నారు. ఆరోగ్యం మెరుగు పడింది.స్వచ్ఛంద  సంస్థలు కొర్పోరేట్లు సంస్థలు పరిశోదనా సంస్థలు గిరిజాన ఆరోగ్యం సలహా మండలి ప్రభుత్వ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం ప్రణాళిక బద్దమైన పద్దతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యం పెంచవచ్చు. దీనివల్ల జిల్లా ఆసుపత్రి కేంద్రాలకు వెళ్ళేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల ప్రత్యేక వైద్యులు నిపుణుల వైద్యం, వైద్య సేవలు ఒకటే సమాధానం కాదు. గిరిజన  జనాభాలో మార్పుతో 
పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలి. గిరిజనులు ఒక ఓటు బ్యాంకుగా చూడకండి వారికి అన్నిరంగాలలో సమాన అవకాశాలు ఇవ్వాలి గిరిజన మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. అది ప్రభుత్వం బాద్యత.