ఢిల్లీకి చంద్రబాబు టీమ్.. బోస్ డీకే అంటే అర్ధం ఇదా.. రేవంత్ సంచలనం.. బిగ్ ఫైట్ టాప్ న్యూస్ @ 7PM

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రం పెద్దలను కలవబోతోంది. సోమవారం మధ్యాహ్నం టీడీపీ బృందానికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది.-----జగన్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని సీపీఐ రామకృష్ణ తప్పుబట్టారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందన్నారు. అప్పులు తెస్తేనే రాష్ట్ర మనుగడ.. లేకపోతే దుర్భర పరిస్థితి అన్నట్లుగా మారిందని చెప్పారు. ఆర్ధికంగా చిన్నాబిన్నమై అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అందని ద్రాక్షలా ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగిపోయాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.---------
సానుభూతి వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం జగన్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కోడికత్తి నుంచి ప్రతిదానిని వదలని జగన్‌...బోస్‌డీకే పదాన్ని వదులుతాడా? అని ఆయన ప్రశ్నించారు. సజ్జలను బోస్‌డీకే అంటే అది తననే అన్నారని జగన్ అన్వయించుకున్నారని మండిపడ్డారు. బోస్‌డీకే పదానికి పెడర్థాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్‌ కార్డు జగన్‌ బయటకు తీశారని చెప్పారు
--------
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన జోగరాజు, ఎస్‌కే బాబు, ఎస్‌కే సైదా.. గుంటూరుకు చెందిన బంక సూర్య సురేష్‌, కల్లా మోహన్ కృష్ణారెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
-------
విశాఖ జిల్లా  మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. నిర్వాహకుడు ప్రభాకర్‌‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్, 2 సెల్‌ఫోన్లు, 2 చెక్‌బుక్‌లు, 2 ఏటీఎం కార్డులతో పాటు రూ.88 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు
-----
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శల్లో పదును పెంచారు. దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారని వెల్లడించారు. అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికకు దారితీసిందని వివరించారు. 
-----
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనారిటీలకు సీఎం కేసీఆర్ ఏడాదికి వేయి కోట్లు ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇళ్ల కేటాయింపులలో ముస్లింలకు 25 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన 60 వేల ఓట్లు సాధిస్తే మనదే విజయమని జీవన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.
--
 షర్మిల పాదయాత్రకు ఊహించని మద్దతు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.. షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.షర్మిల పాదయాత్ర ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారం ఏరియాలో సాగుతోంది. నాగారం గ్రామానికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి... షర్మిలను కలిసి మాట్లాడారు. కొద్దిసేపు ఆమెతో కలిసి నడిచారు. టీటీడీ చైర్మెన్ షర్మిల పాదయాత్రకు మద్దతు తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది.
-----
జమ్మూ సిటీ, శ్రీనగర్‌లో రెండేళ్లలో మెట్రో సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. జమ్మూలోని భాగ్‌వతి నగర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించి, జమ్మూకశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రారంభించిన అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని అమిత్‌షా స్పష్టం చేశారు.
----
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై నవంబరు 14 నుంచి 29 వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా  మొదటి వారంలో దేశవ్యాప్తంగా తమ పార్టీ నేతలు ఎవరి ప్రాంతాల్లో వారు పాదయాత్రలు నిర్వహిస్తారన్నారు.