Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రగ్రహణం.. శ్రీవారి ఆలయం మూత
posted on: Mar 3, 2026 11:14AM
.webp)
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ ఉదయం మూసివేశారు. గ్రహణ ప్రభావం దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో రేపు నిర్వహించాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు.
తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల కోటాను కూడా నిలిపివేశారు. గ్రహణ సమయం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయ తలుపులు మూసివేశారు. రాత్రి ఏడున్నర గంటలకు ఆలయాన్ని తెరిచి, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి ఎనిమిదిన్నర నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.






