Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వేసవి కదా అని ఈత కొట్టడానికి వెళ్తున్నారా? ఈ తప్పులు చేయకండి..!
posted on: Apr 4, 2026 12:47PM

వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ ఫూల్ లేదా బావులలో ఈత కొట్టడం కూడా ఒక మార్గం. అయితే చాలా మంది ఈత కొట్టడం అంటే మునిగిపోతారనో లేక జలుబు, చెవి సమస్యలు వస్తాయనో కంగారు పడుతూ ఉంటారు. కానీ ఈత కొట్టడం వల్ల వీటి కంటే పెద్ద సమస్య.. అందులోనూ నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా కంగారు పెట్టే సమస్య ఒకటుంది. అదే కంటి ఇన్ఫెక్షన్లు.. ఈత వల్ల కళ్లకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
స్విమ్మింగ్ ఫూల్ నీటిలోని క్లోరిన్, రసాయనాలు, బ్యాక్టీరియా కొన్నిసార్లు కళ్లలోని సున్నితమైన పొరను దెబ్బతీసి, చికాకు, ఎరుపు, దురద, దృష్టి మసకబారడానికి కారణమవుతాయి. జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈత కొడుతున్నప్పుడు కంటి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి.
వేసవిలో అధిక చెమట, దుమ్ము , రద్దీ కారణంగా కళ్ల సెన్సిటివ్ పెరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ నీటిని సరిగ్గా శుభ్రపరచకపోతే, అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి. ఈ బాక్టీరియా కంటి బయటి పొర (కంజంక్టివా) వాపుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంట, కళ్ళు ఎర్రబడటం, దురద , కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలుగవచ్చు. మురికిగా ఉన్న లేదా జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టడం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది.
స్విమ్మింగ్ ఫూల్ మెయింటెన్స్ సరిగా లేకపోతే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా ప్రోటోజోవాలు డవలప్ అవుతాయి. ఇవి కళ్లకు సోకి, వాపును కలిగిస్తాయి. ఎక్కువ కాలం వీటికి గురికావడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఈత కొట్టే ముందు శుభ్రమైన, సరిగ్గా సరిపోయే, నీరు చొరబడని గాగుల్స్ ధరించాలి. రసాయన రియాక్షన్స్ తగ్గించడానికి, కంటి మేకప్ లేదా జిడ్డు క్రీములను తొలగించిన తర్వాతే ఈత కొట్టాలి.
స్విమ్మింగ్ పూల్‌లో అటు ఇటు నుండి చిమ్మే నీటి నుండి జాగ్రత్త పడాలి. నీరు కంటి మీద పడకుండా చూసుకోవాలి. ఈత కొట్టిన తర్వాత కళ్లను చల్లని, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి.
అవసరమైతే కంటికి తేమను అందించే చుక్కల మందును వాడాలి. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ ను సొంతంగా తీసుకెళ్లడం మంచిది. స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జనం ఎక్కువగా కనిపించినా, నీరు మురికిగా కనిపిస్తున్నా అక్కడ ఈత కొట్టకపోవడం మంచిది.
*రూపశ్రీ.


.webp)


