Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒకే సారి మూడు నెలల రేషన్!
posted on: Mar 5, 2026 12:56PM
.webp)
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకుకు ఏప్రిల్ నెలలో ఒకే సారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని సరఫరా చేయనుంది.
వేసవిలో ఎండల్లో గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద వేచి ఉండి జనం ఇబ్బందులు పడకండా ఉండేందుకు కేంద్ర పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏ నెల రేషన్ బియ్యం ఆ నెలే సరఫరా చేస్తారు. కానీ ఈ సారి వేసవి తీవ్రత అధికంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ బియ్యాన్నీ ఒకే విడతలో ఏప్రిల్ లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కేంద్రం నిర్ణయం పట్ల ప్రజలలో హర్షం వ్యక్తం అవుతోంది.


.webp)



