Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. ఇవి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట..!
posted on: Apr 10, 2026 5:10PM

ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే..
ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం?
శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు సమస్య..
కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం.
నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు..
పాలకూర..
పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది.
బీట్‌రూట్ ..
బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది.
ఆకుకూర సలాడ్లు..
ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి. ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు. ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం.
మెంతులు..
మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
కాలీఫ్లవర్..
క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.
*రూపశ్రీ.






