నాలుగు స్థంభాలాట‌!

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీలో పోటీ పెరిగిపోతోంది. ఉపఎన్నిక ఇన్‌చార్జ్ అయితే అమిత్ షా వద్ద పరపతి పెరుగుతుందనే ఆలోచనతో నేతలు కసరత్తులు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌చార్జ్ కోసం బీజేపీ నేతలు పోటీపడుతున్నారు. మునుగోడు బీజేపీ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్ రేసులో నలు గురు నేత‌లు ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, మనోహర్ రెడ్డి ఇన్ చార్జ్ కోసం పోటీపడుతున్నారు. 

మునుగోడు ఉప ఎన్నికల పర్వం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లతోపాటు సీపీఐ, బీఎస్పీ పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. బరిలో ఎందరు అభ్యర్థులు వున్నా మునుగోడులో చతుర్ముఖ పోటీ ఖాయమనిపిస్తోంది.

అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఉప ఎన్నికకు ఇన్ చార్జ్ ఉంటే అమిత్ షా వద్ద పరపతి పెరు గుతుందని నేతల ఆలోచన. అమిత్ షా సభ తర్వాత నియోజక వర్గ ఇన్‌చార్జ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్ లను ఈటెల రాజేందర్ బీజేపీలోకి  తీసుకు వచ్చారు.

ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్‌లను ఈటల రాజేందర్ బీజేపీలోకి తీసుకు వచ్చారు. దుబ్బాక, హుజురాబాద్ సెంటిమెంటుతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. అటు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు ఇంచార్జ్‌గా జితేందర్ రెడ్డి పని చేయగా.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా, స్థానిక నేతగా మనోహర్ రెడ్డి ఉన్నారు. మనోహర్ రెడ్డిని ఉప ఎన్నిక ఇంచార్జ్‌గా పెడితే బాగుం టుందని కమలనాథులు అంటున్నారు. అటు రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా, అధిష్టా నానికి రాష్ట్ర నాయ కత్వానికి దగ్గరగా ఉన్న నేతగా వివేక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.