కేంద్రం అస‌మ‌ర్ధ‌త‌వ‌ల్ల‌నే ఆర్ధికవ్య‌వ‌స్థ కుంటుప‌డింది... కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గొల్కొండ కోటపై సీఎం జాతీయ పతా కాన్నిఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, కేంద్రం రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం లో కేంద్రం మొండి చేయి చూపిస్తోందంటూ మండి పడ్డారు. రైతుల ఉద్య మంతో కేంద్రం రైతు నల్లచట్టా లపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. టాక్సుల పేరిట జనాన్ని దోచుకుంటోందని విమర్శిం చారు. చిన్న పిల్లలు తాగే పాలు, స్మశాన వాటిక నిర్మాణంపై కేంద్రం ఎడాపెడా పన్నులు వేస్తోందని తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. ఉచితా లపై కేంద్రం రాష్ట్రాలను అవమ నిస్తోందన్నారు. కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర అస‌మ‌ర్ధ నిర్వాకం వ‌ల్ల‌నే దేశ ఆర్ధిక వ్య‌వస్థ కుంటుప‌డింద‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. దేశంలో నిరుద్యోగం తీవ్ర‌మ‌వు తోంద‌ని కేంద్రంలోని వారు నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని సీఎం మండిప‌డ్డారు. రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉన్న‌వారే నేడు ఫాసిస్టు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. దేశ త‌ల‌స‌రి ఆదాయం కంటే తెలంగాణా త‌ల‌స‌రి ఆదాయం 84 శాతం ఎక్కువ గా ఉంద‌న‌ని ఆయ‌న వెల్ల‌డిచారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ద‌ళిత‌బంధు అనే ప‌థ‌కాన్ని గొప్ప‌గా అమ‌లుచేస్తోంద‌న్నారు. ఈ ప‌థ కం దేశానికి దిశా నిర్దేశం చేస్తోంద‌ని, ప్ర‌భుత్వం వ‌జ్ర‌సంక‌ల్పంతో ఈ ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తోంద‌న్నారు. అహింసామార్గంలో తెలం గాణా సాధించుకున్నామ‌ని, దేశానికి తెలంగాణా దిక్సూచిగా మారింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. 

తెలంగాణా ఆర్ధిక‌రంగ‌రంలో వేగంగా దూసుకుపోవ‌డంతోపాటు అన్న‌పూర్ణ‌గా మారింద‌న్నారు. రాష్ట్రం అపురూప విజ‌యాల‌ను సాధిస్తోంద‌ని, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంతో ఆకుప‌చ్చ‌గా మారింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణా త‌ల‌స‌రి ఆదాయంలో ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌న్నారు. ప్ర‌జాసంక్షేమం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌న్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఉచితాలు అనే ప‌దాన్ని త‌గిలిం చ‌డం దారుణ‌మ‌ని, గ‌త ఏడేళ్ల‌లో సొంత ప‌న్నుల ఆదాయంలో తెలంగాణా మొద‌టిస్థానంలో ఉంద‌ని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిం చారు.