Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ టీడీపీ వెరీగుడ్!
posted on: Jul 16, 2014 11:00AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వున్న సందర్భంలో తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాయి. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని అస్సలు లేకుండా చేయాలని పథకాలు రచించాయి. తెలంగాణ టీడీపీ నాయకుల మీద ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించాయి. అలాంటి సందర్భంలో తెలంగాణ టీడీపీలోని కీలక నాయకులు చంద్రబాబుకు అండగా నిలిచారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, ఇటు తెలంగాణలో టీడీపీ గౌరవప్రదమైన స్థానాలు పొందడానికి సహకరించారు. ఇతర పార్టీలు... ముఖ్యంగా టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నాయకులను తన పార్టీలోకి లాక్కోవాలని తీవ్రంగా ప్రయత్నించినా ఎవరూ ఆ మాయలో పడకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఎర్రబెల్లి దయాకరరెడ్డి లాంటి నాయకుడైతే రాజకీయాల్లోంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని బతుకుతాను తప్ప తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలున్న పార్టీ కాబట్టే తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగంలో గౌరవాన్ని పొందుతోంది. తాజాగా మరోసారి తెలంగాణ తెలుగుదేశం మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించే ప్రయత్నాలు జరిగాయి. తలసాని, రేవంత్ రెడ్డి లాంటి పలువురు తెలుగుదేశం నాయకులు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని పుకార్లు క్రియేట్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చాలా ఘాటైన కామెంట్ చేసి పుకార్లను తిప్పికొట్టారు. కేసీఆర్ తన కాళ్ళు పట్టుకుని బతిమాలినా టీఆర్ఎస్‌లో చేరబోనని స్పష్టం చేశారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళబోతున్నారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఇప్పటి వరకు తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళింది లేదు. తలసాని టీఆర్ఎస్ వైపు చూసిందీ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు వుంటాయని వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పుకార్లను సమర్థంగా తిప్పికొట్టిన తెలంగాణ టీడీపీ వెరీగుడ్ అంటున్నారు.


.jpg)
.jpg)


