Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోచారం బుక్కైపోయారా?
posted on: Nov 10, 2014 3:56PM

అడ్డంగా వాగి బుక్కైపోవడం.. ఆ తర్వాత నాలుక కరుచుకోవడం కొందరు రాజకీయ నాయకులకు అలవాటే. ఏదో మామూలు అంశంపైన మాట్లాడితే ఓకే కానీ సీరియస్ ఇష్యూపైన నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం చిక్కుల్లో పడడం ఖాయం. తెలంగాణ మంత్రి పోచారం కూడా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు.
అసెంబ్లీ నడుస్తున్న కీలక తరుణంలో పోచారం శ్రీనివాసరెడ్డి రైతు ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యల వెనక చాలా కారణాలున్నాయంటూ వెటకారంగా మాట్లాడారు. ఇంత సీరియస్ ఇష్యూపైనా వెటకారం అవసరమా? అది కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నా పోచారం ఇలా మాట్లాడితే దానికి అర్థం ఏముంటుంది? అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. పోచారం శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
ప్రతిపక్షాల విమర్శలను పక్కనబెడితే ఇప్పుడు సొంత ప్రభుత్వంలోనే పోచారంపై చాలామంది నిప్పులు చెరుగుతున్నారట. సీఎం కేసీఆర్ అయితే పోచారం శ్రీనివాసరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకారట. రైతు ఆత్మహత్యలపై ఏం చేయలేక చేతులెత్తేసిన తరుణంలో ఇలాంటి మాటలు అవసరమా? అని సీరియస్ అయ్యారని అధికారపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి పోచారం కామెంట్స్ కేసీఆర్ సర్కారును డిఫెన్స్ లో పడేశాయంటున్నారు విశ్లేషకులు.



.jpg)


