Latest News
అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం
posted on: Mar 20, 2026 9:15AM

తెలంగాణ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసమూ ముగ్గురు సీనియర్ శాసనసభ్యులను విప్‌లుగా నియమించింది.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికె.రామకృష్ణారావు గురువారం ( మార్చి 19) ఉత్తర్వులు జారీ చేశారు.


.webp)



