Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గణపతీ లొంగిపోండి.. మావోయిస్టు అగ్రనేతకు డీజీపీ పిలుపు
posted on: Mar 30, 2026 5:19PM
.webp)
తెలంగాణలో అజ్ఞాతంలో కొనసాగుతున్న మావోయిస్టు అగ్రనేతలకు రాష్ట్ర పోలీస్ శాఖ కీలక అల్టిమేటమ్ జారీ చేసింది. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వెంటనే లొంగిపో వాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇటీవల లొంగిపోయిన ఓమావోయిస్టు ద్వారా గణపతి ఆరోగ్యం సరిగా లేదన్న సమాచారం అందిందన్న డీజీపీ, వయస్సు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అజ్ఞాత జీవితం కొనసాగించడం కష్టమవు తుందన్నారు. గణపతి లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు. కేంద్రం మావోయిస్టుల లొంగుబాటుకు ఇచ్చిన గడువు మంగళవారం (మార్చి 31)తో ముగియనున్న నేపథ్యంలో.. అజ్ఞాతంలో ఉన్న నాయకులు వెంటనే లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారికి భద్రత, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
ప్రస్తుతం ఇంకా లొంగిపోని తెలంగాణకు చెందిన మావోయిస్టులు పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, వరు శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రతా బాయి అలియాస్ సుజాత, నక్క సుశీల్ అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఉన్నారన్నారు. అడవుల్లో గడుపుతున్న జీవితాన్ని ముగించి వీరంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ మరోసారి పిలుపునిచ్చారు.



.webp)


