Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం పొడిగింపు
posted on: Mar 18, 2026 7:40PM

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు మరో మూడు నెలల పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందించింది. ఈ పొడిగింపుతో పరిపాలనలో కొనసాగింపు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి, గతేడాది ఆగస్టు 31న రామకృష్ణారావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సేవలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం ఇప్పటికే ఆయనకు ఏడు నెలల పొడిగింపు మంజూరు చేసింది.క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో రామకృష్ణారావు కీలక పాత్ర పోషించారు.
యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమన్వయం కల్పించడం, గత ప్రభుత్వ రుణాల షెడ్యూలింగ్‌లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.ఇక మార్చి 31తో ప్రస్తుత పొడిగింపు గడువు ముగియనున్న నేపథ్యంలో, మరోసారి ఎక్స్‌టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాయగా, కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో రామకృష్ణారావు మరో మూడు నెలల పాటు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు.



.webp)


