Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ అసెంబ్లీ 23కి వాయిదా
posted on: Mar 20, 2026 4:18PM
.webp)
తెలంగాణ శాసనసభ సోమవారానికి (23-3-26) వాయిదా పడింది. శుక్రవారం సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ప్రజా క్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది సర్కార్. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. ‘మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.కాగా... ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కొనసాగతుండగానే సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది. అన్ని వర్గాలను మోసం చేశారంటూ.. చెవిలో పూలు పెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను చించివేశారు. బడ్జెట్ మొత్తం మోసం.. మోసమంటూ బీఆర్‌ఎస్ సభలో నిరసనలు తెలిపింది.
ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవంటూ బీఆర్‌ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ నుంచి బీఆర్‌ఎస్ నేతల వాకౌట్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నీళ్లు కూడా తాగలేదన్నారు. కానీ బీఆర్‌ఎస్ నేతలు మాత్రం బడ్జెట్‌ను విమర్శిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకొని వెళ్లిపోయారని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రతులను చించివేయడం బాధాకరమన్నారు.


.webp)
.webp)


