Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెవెన్యూలో సగం ఉద్యోగులకే... మరి బంగారు తెలంగాణ ఎలా సాధ్యం?
posted on: May 9, 2017 12:19PM

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు ఉద్యోగుల జీతాలు పెంచుకుంటూ పోతున్న కేసీఆర్... రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. బంగారు తెలంగాణ అంటూనే భవిష్యత్‌ను అంధకారంలోకి తీసుకెళ్లిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు కేసీఆర్ అండగా నిలిచారన్న కృతజతతో ఇష్టమొచ్చినట్లు జీతాలు పెంచేస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఇరకాటంలో పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ చేశారు. కేసీఆర్‌కి అండగా నిలిచారు. ఆందోళనలు, ధర్నాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్... ఉద్యోగులను సంతోషపర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగులు నిరాశకు గురి చేయకుండా భారీగా జీతాలు పెంచడం మొదలుపెట్టారు.
2015 మార్చిలో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి....3 లక్షల మంది ఉద్యోగులు, లక్షన్నర మంది పెన్షనర్లను ఆనందంలో ముంచెత్తారు. అంతేకాదు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను 2014 జూన్ నుంచి అమలు చేశారు. కేసీఆర్ నిర్ణయంతో ప్రభుత్వంపై ఒకేసారి 6వేల 5వందల కోట్ల రూపాయల భారం పడింది. దీనికి తోడు ఏరియర్స్ రూపంలో మరో 3వేల 5వందల కోట్ల రూపాయల అదనపు బండ పడింది. తర్వాత 57వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయంతో అదనంగా ప్రభుత్వంపై ఏడాదికి 8వందల కోట్ల రూపాయలు భారం పడింది. అంతేకాదు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ కింద ఉద్యోగులకు 570 కోట్ల రూపాయలు, డీఏ కింద 5వందల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదే సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లకు జీతాలను పెంచారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి మరో 450 కోట్ల రూపాయల భారం పడుతోంది. ఉద్యోగుల జీతాలే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల జీతాలను 2016లో పెంచారు.
ఇలా వరుసగా జీతాలు పెంచడంతో.... తెలంగాణ సర్కార్‌కు వచ్చే రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉద్యోగాల జీతాలు 18 వేల 4వందల కోట్ల రూపాయలుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్ కాస్తా 25వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం జీతాల భారం 30వేల కోట్ల రూపాయలకు చేరింది. వరుసగా జీతాలు పెంచుతుండటంతో... సర్కారుకు వచ్చే రెవెన్యూలో సగభాగం జీతాలకే వెచ్చించాల్సి వస్తోంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదని, ముందుముందు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.



.jpg)


