Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టి20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్షిష్టం
posted on: Feb 23, 2026 11:31AM
.webp)
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 లో భాగంగా నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమితో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్షిష్టంగా మారాయి. సూపర్ 8లో భారత్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలోనూ విజయం సాధించినా టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవ్వడం అంత తేలిక కాదు. భారత్ సెమీస్ కు చేరాలంటే.. వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలచినా నెట్ రన్ రేట్ కీలకం కానుంది.
భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. అయితే దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి, అదే సమయంలో వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విజేత కూడా దక్షిణాఫ్రికాను ఓడిస్తే, అప్పుడు మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లతో భారత్‌తో సమానంగా నిలుస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నెట్ రన్‌రేట్ ఆధారంగానే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.
కాగా ఆదివారం (ఫిబ్రవరి 22)న దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ టోర్నీలో తన తొలి ఓటమిని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 76 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. టీమ్ ఇండియా బ్యాటర్లలో శివం దుబే 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక టీమ్ ఇండియాను కట్టడి చేసే విషయంలో సఫారీ బౌలర్లు సమష్టిగా చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీసుకుని భారత్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చారు.


.webp)



