టీమ్ ఇండియా నెక్ట్స్ హెడ్ కోచ్ ధోనీ?.. గంభీర్ స్టెప్ డౌన్ కన్ ఫర్మేనా?

posted on: Mar 18, 2026 10:06AM

టీమ్ ఇండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. తన పదవీ కాలం పొడిగింపు పట్ల గంభీర్ సుముఖంగా లేరన్న వార్తలు క్రికట్ వర్గాలలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం టీమ్ ఇండియాకు అన్ని ఫార్మాట్లలోనూ గౌతం గంభీరే హెడ్ కోచ్.. వరుస టోర్నీల విజయంతో టీమ్ ఇండియా గౌతం గంభీర్ కోచింగ్ లో బాగానే రాణిస్తోంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ విజేతగా కూడా నిలిచింది.

ఈ నేపథ్యంలో గంభీర్ హెడ్ కోచ్ గా స్టెప్ డౌన్ అయితే అతడి వారసుడెవరన్న చర్చ క్రికెట్ ప్రపంచంలో, క్రికెట్ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే  గంభీర్ ఇటీవల గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి.  టీమ్ ఇండియాకు రెండు వరల్డ్ కప్ లు అందించిన  ధోనీ అయితేనే జట్టును సరైన దిశలో నడిపించగలడని గౌతం గంభీర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అపార అనుభవం, తీవ్ర ఒత్తిడిలోనూ తన కూల్ ను కోల్పోకుండా సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం ఉన్న ధోనీ టీమ్ ఇండియా హెచ్ కోచ్ పదవికి సరిగ్గా ఫిట్ అవుతాడన్నది గంభీర్ అభిప్రాయంగా చెబుతున్నారు.  

ధోనీకి హెడ్ కోచ్ పదవి అన్న ప్రతిపాదనను  గంభీర్ ఇప్పటికే బీసీసీఐ పెద్దల వద్ద చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ లేదు.  ధోనీకి పూర్తిస్థాయి కోచ్‌ బాధ్యతలు అప్పగిస్తే.. యువ ఆటగాళ్లకు   మార్గనిర్దేశం చేయడం, వారి ప్రతిభకు సానపట్టడం ద్వారా ధోనీ అభేధ్యమైన జట్టును తయారు చేస్తాడని క్రికెట్ అభిమానులు సైతం అంటున్నారు.  ఇలా ఉండగా   ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. ఒకవేళ ఆయన కోచ్ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తే, ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...