Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్కంఠ పోరులో విజయం.. టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు టీమ్ ఇండియా
posted on: Mar 5, 2026 10:22PM

టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం (మార్చి 5) రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించి ఫైనల్స్ దూసుకెళ్లింది. అయితే ఈ విజయం టీమ్ ఇండియాకు సునాయాసంగా దక్క లేదు. చెమటోడ్చింది. ఆఖరి ఓవర్ రెండో బంతి పడే వరకూ విజయం సాధించేందుకు ఇరు జట్లకూ సమానావకాశాలు ఉన్నాయి. బంతి బంతికీ ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది. ఒక దశలో అయితే భారత్ విజయం కష్టమే అని పించింది.
అయితే ఒత్తిడిని తట్టుకుని టీమ్ ఇండియా విజయం సాధించింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెడితే.. టాస్ కొల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఇక 39 పరుగులతో ఇషాన్ కిషన్, 43 పరుగులతో, శివమ్ దూబే దూకుడుగా ఆడుతూ రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా చూశారు. చివరిలో తిలక్ వర్మ 7 బంతుల్లో 21పరుగులు, హార్దిక్ పాండ్యా 27 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
ఇక తరువాత 254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ దాదాపు లక్ష్యాన్ని ఛేదించేసినంత పని చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెతెల్ సెంచరీతో అద్బుతంగా ఆడాడు. ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగి సెంచరీ చేశారు. అలాగే విల్ జాక్స్ 35 పరుగులతో రాణించాడు. బెతెల్ ఆడుతున్నంత సేపూ ఇంగ్లాండ్ విజయం ఖాయం అనిపించింది. అంతలా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు.
అఖరి ఓవర్లో విజయానికి ఇంగ్లాండ్ 30 పరుగులు చేయాల్సి ఉండగా ఆ ఓవర్ తొలి బంతికే బెతెల్ రనౌట్ కావడంతో భారత్ విజయం ఖరారైంది. స్ట్రైక్ తన వద్దే ఉంచుకోవడం కోసం లేని రెండో పరుగుకు ప్రయత్నించి బెతెల్ రనౌట్ అయ్యాడు. ఇక చివరి ఐదు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లాండ్ 22 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమ్ ఇండియా విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.
ఇక ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది అక్షర్ పటేల్ పట్టిన రెండు క్యాచ్ లు. ముఖ్యంగా విల్ జాక్స్ బలంగా కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద రన్నింగ్ క్యాచ్ అందుకుని తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ దుబేకి అందించిన తీరు అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే ఆ క్యాచే మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు.



.webp)


