Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్...నారా లోకేష్ బయోగ్రఫీ
posted on: Apr 15, 2026 6:16PM

నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నారా లోకేష్ జీవిత విశేషాలు ఎలాంటివో పరిశీలిస్తే..లోకేష్ టీడీపీ పార్టీ జనానికి ఒక ఏడాది తర్వాత జన్మించారు. ఆయన జన్మదినం 1983 జనవరి 23. అదే టీడీపీ 1982 మార్చి 29న ఆవిర్భవించింది. అంటే పార్టీతో సమానంగా ఆయన జీవితం ఎదుగుతూ వచ్చింది.
ఇటు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడిగా, మరో సీఎం చంద్రబాబు తనయుడిగా లోకేష్ జీవితం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక తల్లి నారా భువనేశ్వరీ దేవి, సతీమణి బ్రాహ్మణి. లోకేష్ కి ఒక కొడుకు దేవాన్ష్. నారా లోకేష్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ లో సాగింది. గ్రాడ్యుయేషన్- అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్- ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆపై ప్రపంచ బ్యాంకులో పని చేసిన అనుభవం సైతం సాధించారు.
ఇక రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. లోకేష్ నేరుగా పదవుల్లోకి రాకుండా, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం తెరవెనుక పని చేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థాగత బాధ్యతలు ఎప్పుడు చేపట్టారో చూస్తే.. 2013లో పార్టీలోకి అధికారికంగా ప్రవేశించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ, వేలాది మంది కార్యకర్తలకు బీమా, ఇతర సౌకర్యాలు అందేలా చూశారు. మంత్రిగా సేవల విషయానికి వస్తే.. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో గ్రామాల్లో LED లైట్ల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణం.. ఐటీ కంపెనీలను విశాఖపట్నం, అమరావతికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2019లో అధికారం పోయాక.. మరీ ముఖ్యంగా తాను మంగళగిరిలో ప్రత్యక్ష ఎన్నికల్ల్లో ఓడిపోయాక.. నారా లోకేష్ లో తీవ్ర అంతర్మధనం మొదలైంది. తన బాడీ ఫిట్ నెస్ తో పాటు అన్ని అంశాల్లోనూ దృష్టి సారించారు. 2023లో యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయి. కొన్ని అనివార్య కారణాల వల్లీ ఈ యాత్ర మధ్యలో ఆగినా దాని ఇంపాక్ట్ పార్టీలో, కేడర్లో చాలా పెద్దగానే ఉందని చెప్పాలంటారు విశ్లేషకులు.
2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం విద్యా, ఐటీ, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలను చేపట్టారు. అసలు పార్టీ పరంగా ఇప్పటి వరకూ లోకేష్ ఏం చేశారో చూస్తే.. పార్టీ సభ్యత్వ నమోదును డిజిటలైజ్ చేయడంలో ఆయన కృషి అమోఘం. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే.. పంచాయతీ రాజ్ శాఖలో చేసిన సంస్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక ఎన్నికల విజయాల పరంగా చూస్తే.. 2019లో ఓటమి ఎదురైనా, పట్టు వదలకుండా ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ప్రజలకు చేరువయ్యారు.
2024లో అదే నియోజకవర్గంలో 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. నారా లోకేష్ తన విద్యా నైపుణ్యం, ఆధునిక ఆలోచనా ధోరణితో పార్టీని భవిష్యత్ తరాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.లోకేష్ తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిందే కార్యకర్తల నుంచి. పార్టీకి ఇదెంత మేలు చేస్తుందంటే.. కార్యకర్తల సంక్షేమంలో లోకేష్ ది కీలక పాత్ర కాబట్టి. పార్టీ అంటే కార్యకర్త కాబట్టి.. ఎంతైనా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఈ నిర్ణయం కార్యకర్తకొక పండగ రోజుగా భావిస్తున్నారంతా.



.webp)


