Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్రమశిక్షణ గీత దాటితే వేటు తప్పదు.. కొలికిపూడికి పల్లా వార్నింగ్
posted on: Feb 12, 2026 2:47PM

తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు పార్టీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణ గీత దాటితే వేటు తప్పదని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. అసెంబ్లీ లాబీలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కొలికిపూడికి ఈ విషయాన్ని నేరుగా చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ హెచ్చరిక చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయం గుర్తించి ప్రవర్తించాలని ఈ సందర్భంగా పల్లా కొలికిపూడికి హితవు పలికారు. క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే ప్రశక్తే లేదని సీఎం చంద్రబాబు మాటగా పల్లా కొలికిపూడికి చెప్పారు.
ఎన్నిసార్లు మందలించినా పద్దతి మార్చుకోకుండా తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ సహించబోదని, ఎమ్మెల్యే గా కూడా గుర్తించదని కుండబద్దలు కొట్టారు. అర్థంపర్థంలేని స్టేటస్‌లతో ఎవరిమీద పోరాడుతున్నారని నిలదీశారు. పల్లె కన్నీరు పెడుతోందంటూ ఇటీవల కొలికిపూడి పెట్టిన పోస్టును అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.
ఆ క్రమంలో పార్టీయేసుప్రీం అని చెబుతూ.. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని ఘాటుగా చెప్పారు. దీనిపై కొలికిపూడి అనుభవ రాహిత్యంతో పొపరాట్లు జరుగుతున్నాయని వివరణ ఇచ్చుకుని సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కోరారు.






