Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇవేం పార్టీ ఫిరాయింపులు... వీరేం నేతలు
posted on: Apr 27, 2018 4:51PM

ఏపీ ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. ఒక పార్టీలో ఉన్న నేత మరో పార్టీలోకి వరుసపెట్టి జంప్ జిలానీలు అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నుండి ఎంతో మంది నేతలు అధికార పార్టీలోకి జంపు అయ్యారు. మరోవైపు పలువురు బీజేపీ నేతలు కూడా వైసీపీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ నుండి కన్నీ లక్ష్మీ నారాయణ. పార్టీ అధ్యక్ష పదవి వస్తుందనుకున్న కన్నాకు పార్టీ అధిష్టానం షాకిచ్చి.. ఆపదవిలో సోము వీర్రాజును నియమించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. అయతే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ...బీజేపీ ఆ నిర్ణయం మార్చుకున్నారు. దీంతో పార్టీమీద అసంతృప్తితో ఉన్న కన్నా వైసీపీలోకి మారాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు అమిత్ షా. జగన్ కు ఫోన్ మా వాళ్లని పార్టీలోకి తీసుకోవద్దని చెప్పారు. అంతేకాదు కన్నాకు కూడా ఫోన్ చేసి...పార్టీ మారొద్దని చెప్పారు. దీంతో ఆయన మనసు మార్చుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీలోకి వెళుతున్నట్టు రాజకీయ వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నానని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నానని చెప్పారు. టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... కానీ, తనను పార్టీ చిన్న చూపు చూసిందని అన్నారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి, మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ కూడా తనకు హామీ ఇచ్చి, దగా చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తాను టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించానని... తన నిర్ణయంలో మార్పు ఉండదని, భగవంతుడు చెప్పినా తాను వినబోనని చెప్పారు.
మొత్తానికి త్వరలో ఏపీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు కూడా బాగానే పుంజుకున్నాయి. తమకు అనుకూలంగా లేకపోతే చాలు తమ భవిష్యత్తు కోసం కొంచం కూడా ఆలోచించకుండ తమ దారి తాము చూసుకుంటున్నారు. మరి వేరే పార్టీలో కూడా పరిస్థితి ఇలా ఉంటే.. మళ్లీ జంప్ అయిన పార్టీలోకే వచ్చేస్తారు. మరి వాళ్లకి ఇవన్నీ కామనే కదా.. ఒకప్పుడు ఏ పార్టీలో ఎవరున్నారో చెప్పడం ఈజీగా ఉండేది... కానీ ఇప్పుడు ఏ పార్టీలో ఎవరున్నారో... చెప్పడం కష్టమే..ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే నేతలందరూ ఆపార్టీలోకే వచ్చేస్తున్నారు..



.jpeg.jpg)


