Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్‌కి కోదండరామ్ పెంపుడుకుక్కా?
posted on: Apr 7, 2014 4:21PM

పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మొదటి నుంచీ టీఆర్ఎస్‌కి, కేసీఆర్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో వాస్తవాలు అందరికీ తెలుసు. దీనిమీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే వుంది. కోదండరామ్ కేవలం టీఆర్ఎస్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వుంటారని, టీఆర్ఎస్ ఆదేశాలను పాటిస్తూ వుంటారని, తెలంగాణ కోసం కృషి చేస్తున్న మిగతా పార్టీలను ఎంతమాత్రం పట్టించుకోరని అంటూ వుంటారు. ఇవన్నీ ఇలా వుంటే, కోదండరామ్ గురించి తెలుగుదేశం శాసనసభ్యుడు, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు కాపలా కుక్కలా వుంటానని చెప్పుకునే కోదండరామ్ కేసీఆర్ పెంపుడుకుక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోదండరామ్ ఒక ప్రొఫెసర్‌లా కాకుండా పోరంబోకు లాగా మాట్లాడుతూ వుంటారని నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. కోదండరామ్ వ్యవహారశైలి టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నట్టు వుంటుందే తప్ప, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ స్థాయిలో వుండదని నర్సిరెడ్డి దుయ్యబట్టారు. తమకు నచ్చని పార్టీలు తెలంగాణలో వుండకూడదనే ప్రజాస్వామ్య విరుద్ధమైన ధోరణి కేసీఆర్‌లో, కోదండరామ్‌లో కనిపిస్తున్నాయని నర్సిరెడ్డి విమర్శించారు.


.jpg)
.jpg)


