Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీసీల సంక్షేమం కోసం తీర్మానం ఆమోదం
posted on: Sep 6, 2014 9:39PM
.jpg)
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అందరికీ తెలుసు. అందుకు ప్రతిగా బీసీలు కూడా ఆపార్టీకి మద్దతుగా నిలవడంతో ఎన్నికలలో తెదేపా ఘనవిజయం స్వంతం చేసుకొంది. ఎన్నికల సమయంలో అంతకు ముందు పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ప్రకారం ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజయిన శనివారం నాడు చంద్రబాబు స్వయంగా బీసీల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక తీర్మానం ప్రవేశ పెట్టారు. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కేటాయించవలసిందిగా కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని సభ ఆమోదించింది.
ఈ తీర్మానంలో ముఖ్యాంశాలు:
1. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
2. బీసీలకు రాజ్యాంగంలో తగిన హోదా కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి.
3. దేశంలో బీసీ జనాభా ఎంతుందో ఖచ్చితంగా తెలుసుకొనేందుకు సర్వే నిర్వహించాలి.
4. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఉప ప్రణాళికలో బీసీలకు కనీసం 25 శాతం నిధులు కేటాయించాలి.
5. బీసీలకు ఉద్యోగాలలోనే కాక పదోన్నతులలో కూడా రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాలి.


.jpg)
.jpg)


