Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బూత్ స్థాయి నుంచి టీడీపీ పునర్నిర్మాణం చేస్తాం : మంత్రి లోకేష్
posted on: Feb 6, 2026 6:38PM
.webp)
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు. టీం 11 కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, బాబాయి హత్యకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిందని తీవ్రంగా విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రూ.250 కోట్లు దోచేశారని, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచే పార్టీని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, బూత్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని చెప్పారు.
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో ఏపీకి 25 శాతం వస్తోందని, విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వ స్థిరత్వం అవసరమని, కార్యకర్తలంతా బాధ్యతతో పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.


.webp)
.webp)


