Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యుద్ద సన్నాహాలలో తెదేపా, వైకాపాలు?
posted on: Sep 10, 2014 9:05PM
.jpg)
తెదేపా, వైకాపాల మధ్య అకస్మాత్తుగా యుద్ద వాతావరణం ఏర్పడినట్లు కనబడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకొంటున్నారు. వచ్చే నెల నుండి వ్యవసాయ రుణాల మాఫీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ఉద్యమించి తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు సిద్దం అవుతున్నందునే బహుశః తెదేపా నేతలు వైకాపా అధ్యక్షుడిపై యుద్ధం ప్రకటించినట్లు కనబడుతోంది. అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ సభ్యుల చేతిలో పదేపదే భంగపడిన జగన్మోహన్ రెడ్డి అందుకు ప్రభుత్వంపై ఈవిధంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్నారేమో? కానీ దానివలన అధికారపార్టీని ప్రజలలో ఇబ్బంది పెట్టడం తప్ప మరేమీ సాధ్యం కాదనే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోదు. అందువలన ఈ అంశంపై ఉద్యమించడం ద్వారా గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టపరుచుకొంటూ, పార్టీని చైతన్యవంతంగా ఉంచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది. కానీ ఆయన ప్రయత్నాలు అధికార పార్టీని ఇబ్బందిపెట్టేవే కనుకనే తెదేపా నేతలు ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారని భావించాల్సి ఉంటుంది. అయితే ఈ యుద్ధం జగన్మోహన్ రెడ్డి స్వయంగా మొదలుపెట్టారు కనుక దాని వలన ఎదురయ్యే మంచి, చెడ్డా అన్ని పరిణామాలు కూడా ఎదుర్కోక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో రూ.10000కోట్ల పంట రుణాలు మాఫీ చేసేందుకు సిద్దం అవుతోంది. అదే నిజమయితే తెదేపా కూడా వైకాపా ఉద్యమాలను అంతే దీటుగా ఎదుర్కొనే అవకాశం చిక్కుతుంది.


.jpg)
.jpg)


