Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎం విజయ్ విడాకుల వ్యవహారంలో ఊహించని మలుపు..!
posted on: Aug 7, 2026 4:53PM

దళపతి విజయ్ కుటుంబంలో బిగ్ ట్విస్ట్..!
తమిళ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ దంపతుల విడాకుల వ్యవహారంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. విజయ్ భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఊహించని విధంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ లీగల్ డ్రామాకు తాత్కాలికంగా తెరపడినట్లయింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చెంగల్పట్టు న్యాయస్థానంలో సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తమ మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయని, దాంపత్య బంధాన్ని రద్దు చేయాలని ఆమె అందులో విజ్ఞప్తి చేశారు. భరణంతో పాటు చెన్నై నీలంకరైలోని నివాసంలో ఉండేందుకు అనుమతించాలని కూడా కోరారు.
ఈ కేసు విచారణ గత కొన్ని నెలలుగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల జరిగిన విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ ప్రత్యక్షంగా హాజరుకాకపోగా, వారి న్యాయవాదులే కోర్టుకు హాజరయ్యారు. తాజాగా జరిగిన విచారణలో సంగీత స్వయంగా తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.
సంగీత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయమూర్తి, ఈ పిటిషన్‌ను ఉపసంహరణగా పరిగణిస్తూ కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంపై విజయ్ తరఫు లాయర్లు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ నూతన పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశాన్ని కోర్టు ఆమెకు కల్పించింది.
1999లో వివాహబంధంతో ఒకటైన విజయ్, సంగీత దంపతులకు జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో సంగీత చేసిన తీవ్ర ఆరోపణలు, కుటుంబ విభేదాలు తమిళనాట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన సమయంలో ఈ వివాదం బయటకు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది.
పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి గల నిర్దిష్ట కారణాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, కుటుంబ పెద్దలు లేదా హితైషుల జోక్యంతో వివాదాలు సర్దుమణిగాయా అనే కోణంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విజయ్ అభిమానులు మద్దతుదారులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయ యాత్రలు, ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉన్న విజయ్ కెరీర్‌పై ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ దంపతుల మధ్య సఖ్యత పూర్తిగా పునరుద్ధరించబడుతుందా లేదా అనే అంశంపై తమిళ చిత్రసీమ దృష్టి సారించింది.
Tamil actor Vijay, Vijays wife Sangeetha, Vijays divorce petition, Chengalpattu court, TVK chief Vijay, Divorce Petition






