Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుని తిడితే కరెంటు వస్తుందా?
posted on: Oct 21, 2014 3:46PM
.jpg)
కోడిని కొడితే తెల్లారుతుందా? చంద్రబాబును తిడితే తెలంగాణకి కరెంటు వస్తుందా? ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఉత్తరాంధ్ర జిల్లాలను అతాలాకుతలం చేసిన హుడ్ హూద్ తుఫాను వచ్చే వెళ్ళిన మరునాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు తరలివచ్చి దాదాపు వారం రోజులు ఏకధాటిగా సహాయ, పునరావాస చర్యలు స్వయంగా పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తిగా కోలుకోనేవరకు కూడా తను పూర్తిగా ఇదేపని మీద ఉంటానని ఆయన ఇదివరకే చెప్పారు. చెప్పడమే కాకుండా మళ్ళీ అదే పని మీద మరోమారు వైజాగ్ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా ఉత్తరాంధ్ర జిల్లాలలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపైనే ఉందని అందరికీ అర్ధమవుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టు నుండి తెలంగాణా రాష్ట్రానికి విద్యుత్ రాకుండా అడ్డుకొంటున్నారని తెరస నేతలు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్ పై ధర్నా చేయడం హాస్యాస్పదం.
తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన తెరాస, ఈ నాలుగు నెలలలో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందని తెరాసకు కూడా తెలియకపోలేదు. అయినా హామీ ఇచ్చింది. కానీ నానాటికీ తెలంగాణా రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ముదురుతుండటం, ఇదే అదునుగా ప్రతిపక్షాలన్నీ ప్రజలలోకి వెళ్లి అధికార తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటంతో బహుశః దానికి విరుగుడుగా తెరాస నేతలు ఈ ధర్నా కార్యక్రమం చేప్పట్టినట్లు కనబడుతోంది. ఏమయినప్పటికీ శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టు నుండి లభించే విద్యుత్ వలన తెలంగాణ రాష్ట్రానికి కొంత ఉపశమనం కలుగుతుంది తప్ప, దాని వలన ఈ సమస్య నుండి పూర్తిగా గట్టెక్కలేదనే సంగతి అందరికీ తెలుసు. కనుక తెరాస ప్రభుత్వం ఈ విధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందిస్తూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసే బదులు, ఈ సంక్షోభం నుండి గట్టేక్కేందుకు ఆయన సహాకారం కూడా తీసుకొని ఉండి ఉంటే ప్రయోజనం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






