పుట్టా మహేష్ యాదవ్ పై వేటు తప్పదా?.. బాబు హెచ్చరికల సారాంశం అదేనా?

posted on: Mar 18, 2026 4:09PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రముఖంగా ఉండటం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.  డగ్స్   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ క్రమశిక్షణ , ప్రతిష్ట   భంగం కలిగేలా వ్యవహరిస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రశ్నే లేదని స్పష్ఠం చేశారు. మంగళవారం (మార్చి 17)  రాత్రి తిరుపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ప్రస్తావించారు. గత ఎన్నికలలో   రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  పోరుగు రాష్ట్రంలో ఫామ్ హౌస్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? వెళ్లినా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడటమేంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.   ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎంపీ పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిదే.  

అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. సాధారణంగా నేతల పట్ల సౌమ్యంగా ఉండే చంద్రబాబు, ఈ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా  తిరపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో పుట్టా మహేష్ యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తెలుస్తోంది.  డ్రగ్స్ పరీక్షల్లో మహేష్ యాదవ్‌కు పాజిటివ్ రావడంతో  వైసీపీ విమర్శలకు పదును పెట్టింది.

ఈ నేపథ్యంలోనే  పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లే వారిని మోయాల్సిన అవసరం లేదని చంద్రబాబు బాహాటంగానే ప్రకటించారని అంటున్నారు.  పార్టీ షోకాజ్ కు మహేష్ ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే.. ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ పై తీసుకునే చర్య  ఇతర యువ నేతలకు ఒక హెచ్చరికలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...